గంట (బాల గేయం );-ఎం. వి. ఉమాదేవి
- మోగుతుంది వైనాలుగా 

బడిలో గంట మోగేనంట 
దోస్తులతోటి వెళ్లే నంట 
గుడిలో మధురం జేగంట 
గోపురంలోను గువ్వల జంట!

ఎద్దులబండికి అందం గంట 
కోడెదూడమెడలో చిన్నిదో  గంట 
జంగం దేవర చేతిలో గంట 
వంటికి పూసే విభూతి పంట !

వేసవి కాలం మల్లెలనంట 
పూలజడకొస కుచ్చులజంట 
పూరిళ్లపైన ఎగిసే మంట 
అగ్నిమాపకo గణగణ గంట !

పురాతనమై భారీ గంట 
లేపాక్షి బసవకి  రాతి గంట 
సాలార్జంగ్ మ్యూజియం నంట 
అమ్మాయి కొట్టే గడియారం గంట !

వెడ్డింగ్ బెల్స్ మోగే నంట 
క్రిస్మస్ కి తాత బహుమతులంట 
లోహపు చిత్రం మోగే గంట 
పిల్లలకే మోజు ఐస్క్రీమ్ గంట!

కామెంట్‌లు