చెదిరితే.. విరిగితే...
*******
కన్ను చెదిరితే బాధ.. గురి తప్పిందని..ఆ ఓటమి బాధ కొద్ది సేపే ఉంటుంది. కానీ పట్టుదలను, సాధించాలనే కసిని మరింత పెంచుతుంది.
మనసు విరిగితే.. ఆ బాధ జీవితమంతా ఉంటుంది.
కుండెడు పాలల్లో ఓ ఉప్పు గల్లు చాలు విరిగి పోవడానికి...
అనంతమైన నమ్మకంలో ఓ వ్యక్తి చేసిన చిన్న మోసమో, అబద్దమో చాలు. ఆ వ్యక్తి పట్ల మనసు విరిగి ముక్కలై పోవడానికి...
అందుకే మనపై ప్రేమ,అభిమానం, నమ్మకం ఉన్న వారి మనసు విరిగేలా ఎప్పుడూ ప్రవర్తించవద్దు.
అలాంటి వారిని జీవితంలో మళ్ళీ పొందలేం.
కాబట్టి లక్ష్య సాధనలో కన్ను చెదరనీయవద్దు. బతుకు పయనంలో ఎవరి మనసూ విరగనీయ వద్దు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి