1.
పంతము బూన రాదనియు పట్టును జూపక మేలు జేసినన్,
వంతలు నె న్ని యున్న మరి వారధి వేయుట నెంచి నిల్చితిన్ ,
సుంతము లెక్కచేయకను శోకము నింపిరి మానసంబునన్ ,
మంతువు జెందిబంధముల మాయను గంటిని పాలలోచనా! .
2.
మానవ బంధముల్గనగ మాయను గప్పెను లోకమందునన్ ,
హీనము లాయె కార్యములు హేయము గల్గెను రక్త పాశముల్ ,
గానము జేసి వేడెదను గైకొను ప్రార్థన లోక బాంధవా !,
పానము జేసినామదిని పావన మొందగజేయు శంకరా ! .
3.
కొండల పైన యుండెదవు గొప్పగ భక్తులనేల యీశ్వరా!,
నండగ యుండి నాదరిన , యాపదలెల్లను దీర్చవేలరా !,
మొండిగ నుంటివేల ,మది మోహన ముగ్ధ మనోహరుండ వై !
దండిగ నిన్నెనమ్మితిని దానవ మర్దన గౌరి శంకరా! .
వంత...బాధ.
మంతువు... జ్ఞానము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి