గణన-గణితం;--డా.అడ్లూరు నరసింహమూర్తి హన్మకొండ.
గణిత పద్ధతుల్లోన
గణన చేయుటకొరకు
నిక్కముగ ఎక్కాలు
నేర్చుకోవలెనోయి!

చతుర్విధ ప్రక్రియలు
చకచకా చేయుటకు
సులభ పద్ధతులన్ని
శోధించవలెనోయి!

దూరభారాలకు
ఎత్తొంపు కొలతలలో
యూనిట్ల మార్పిడిని
గుర్తించవలెనోయి!
""""""""""""""""""'"'''''"''''''''
       ***


కామెంట్‌లు