ఏరు (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఎక్కడో పుట్టింది ఏరు 
ఇక్కడికి చేరింది ఏరు 
దండిగా నిండింది నీరు 
నిండుగా పారింది నీరు 
చేను పండిందండి జోరు 
తోట నవ్విందండి జోరు 
ఇట్లుంటే కష్టాలు తీరు 
ఇట్లుంటె కోరికలు తీరు 
జనమంత నవ్వితే హోరు!!

కామెంట్‌లు