ప్రపంచ తెలుగు కవితోత్సవం

 ...............................
ప్రపంచ తెలుగుకవిత్రోత్సవం లో సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ కు సన్మానం
...............................
  అంతర్జాతీయ సాహిత్య,సాంస్కృతిక, సామాజిక సంస్థ శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు మరియు జాతీయ కన్వీనర్ శ్రీమతి కొల్లి రమావతి గారి ఆధ్వర్యంలో మార్చి12,13 వ తేదిలలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో జరిగిన ప్రపంచ కవి సమ్మేళనం లో పాల్గొని" నవయుగ వైతాళికుడు శ్రీ శ్రీ" అని గళమెత్తిన కవి ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ ను ఘనంగా సన్మానించారు. ప్రపంచ రికార్డ్24 గంటల 24 నిమిషాల24 సెకెనుల పాటు జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర సాహిత్య అకాడమీ  చైర్ పర్సన్ శ్రీమతి పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి గారు మరియు కళావేదిక జాతీయ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ప్రపంచ కవితోత్సవం లో పాల్గొన్న కవుల పేర్లు భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ లో నమోదైనట్లు కార్యనిర్వాహకులు తెలియచేసారు.ఈ సందర్భంగా ప్రసాద్ మాష్టారు  కి కవులు, సాహితీమిత్రులు, సాహిత్యఅభిమానులు  శుభాకాంక్షలు అందచేశారు.
కామెంట్‌లు