వెంటాడే పద్యం;--మీసాల సుధాకర్.--పి.జి.టి-తెలుగుతెలంగాణ ఆదర్శ పాఠశాలబచ్చన్నపేట, జనగామ జిల్లా
అన్న దానము దానమన వచ్చునే కానీ,
అన్నంబు జాములో నరిగిపోవు.
వస్త్రధానము గూడ భవ్య
దానమే గాని,
వస్త్రమేడాదిలో పాత దగును.
గృహదానమొకటి యుత్కృష్టదానమే గాని,
కొంప కొన్నేండ్లలో కూలిపోవు.
భూమిదానము మహాపుణ్యదానమే గాని,
భూమి యన్యుల చేరి పోవవచ్చు.

అరిగిపోక,ఇంచుకయేని చిరిగిపోక
కూలి పోవక యన్యుల పాలు కాక
నిత్యమయి,వినిర్మలమయి,నిశ్చలమయి
యొప్పుచుండు విద్యాదానమొకటి జగతి.

కామెంట్‌లు