ఏ సమయానికి జరగాల్సినవి
ఆ సమయానికి జరిగిపోవా ల్సిందే... !
సమయపాలన లేని జీవితాలు
అకాల వర్షాలతో నాశనమై పోయిన పంటలా ఐపోవు !!
చదువుకునే వయసు...
నిర్లక్ష్యానికి గురి చేస్తే , నీరందిం చక,ఎదగాల్సినమొక్కనుఎండ
గట్టేసినట్టే కదూ... !
ఉద్యోగాన్ని సంపాదించుకుని
ఆర్ధిక స్థిరత్వానికి పునాదులు వేసుకోవాల్సిన యవ్వనం ఆవారా గా గడిచిపోతే...,
జీవితమంతా దుఃఖభాజనమే!
ఏ వయసుకు ఏది జరగాలో అది జరగాలి !
వయసుమీరిపోతే...వివాహంతో పరిమళించాల్సిన జీవితం వికసించ కుండానే మోడై పోదూ... !
నీ ఒక్క క్షణ ఆలస్యం జీవి తాన్నేబలితీసుకోవచ్చునోయ్!
టైం సెన్స్ ఉన్నవాళ్లు...
విజేతలై నిలుస్తారు !
లేనివాళ్లు... పరాజితులుగా
మిగిలిపోతారు !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి