"ప్రపంచపుస్తకదినోత్సవము-పద్యాంజలి"!!!;-సాహితీసన్మిత్రకట్టరంజిత్ కుమార్-చరవాణి:- 6300474467
 01.
 తే.గీ.
పొత్తమునకెన్నొనామాలుబోలెడుకద
"వొయ్యి"యనితెలంగాణలోనెయ్యమయ్యి
"బుక్కు"రాయలసీమలోమక్కువయ్యి
సంస్కృతంబున"గ్రంథమై"సౌరులద్ది
ఆంగ్లమందున"బుక్సు"గానవతరించి
యిల"కితాబు"గాతలయెత్తినిలిచెగాదె!!!

02.
మత్తకోకిల.
హస్తమందునభూషణమ్ముగనందమైకనిపించుచున్
మస్తుజ్ఞానమునందజేసియుమంచిబుద్ధినిపెంచుచున్
కస్తినంతయుపారద్రోలియుగమ్యమెప్పుడుచేర్చితా
విస్తుపోకనిహెచ్చరించియువిన్నవించునుపొత్తమే!!!

03.
 సీసమాలిక.
వేదశాస్త్రములన్నినాదతంత్రులరీతి
విజ్ఞానరాగాలువెలికితీసె
ఇతిహాసకావ్యాలుహితమునుబోధించి
యిలపురాణమ్ములువెలుగుపంచె
దివ్యప్రబంధాలునవ్యమైయష్టాద
శావర్ణనలతోడస్వాంతమునిడె
శతకపొత్తములన్నిసంస్కృతినేర్పించి
గేయకావ్యములెన్నొకేళియాడె
యక్షగానములన్నియక్షయసంపద
లై,దేశికవితకులయనునింపె
కథలపొత్తములన్నికవ్వించినవ్వించి
వ్యాససంపుటులెన్నొవన్నెలొలికె
నవలలుజిలుగులైనాటకాలవెలుగై
ప్రేక్షకమదిలోనప్రీతిగూర్చె
ఖండకావ్యములన్నిపండువెన్నెలలయ్యి
ఆత్మకథలునెన్నొయార్ద్రమయ్యె
జీవితచరితలుభావితరానికి
కరదీపికలుగానుఖ్యాతిదెచ్చె
వచనసంపుటులన్నివయ్యారమొలికించి
పాఠకహృదయాలపరుగులెత్తి
(తే.గీ.)
పొత్తఘనతనుపొగిడినయుత్తముండు
గద్యతిక్కన్నగ్రంథాలుకళలువిరిసె
"విశ్వనాథ""సినారె"లువిమలయశము
నంది,"రావూరి"సాహితీడెందమలరె
భవ్య"జ్ఞానపీఠమ్మునువాణికరుణ
చేత,నధివసించియుతెల్గుజ్యోతులైరి!!!

కామెంట్‌లు