ము.మూ.మె.మే - పాదాదిలో;-మమత ఐలకరీంనగర్9247593432
 తే.గీ
ముద్దు మోమునుజూడగన్ ముచ్చటగును
మూగ వనకుండ పలికిన వేడుకగును 
మెరయు చున్నట్టి సుగుణాలు వరము కాగ
మేలిమైనట్టి విజయాల మిలిత మగును

మూ ము.మే మె - పాదాదిలో
ఆ.వె
మూడడుగులనేల రేడుని కోరగా
ముదముతోడ నిచ్చె బుధుని గనక
మేను పెంచుచు హరి మేఘాలనంటుచు
మెరుపుతోడ కాలు మీదబెట్టె 

కామెంట్‌లు