శ్రీమద్రామాయణం ఆది గ్రంథం.
ఈ గ్రంథాన్ని సాంస్కృతిక కోణంలో చూడవచ్చు, అలాగే భాష పరంగా కూడా చూడగలం.
సంస్కృతంలో ప్రథమేతిహాసంగా వర్ధిల్లుతున్నటు వంటి రామాయణ మహా కావ్యం విశ్లేషిస్తే
ఆదికవి వాల్మీకి రామాయణాన్ని పాఠ్య గేయ రచన అయితే మధురంగా తీర్చిదిద్దాడు. రామాయణం
చదువుకోడానికే గాక పాడు కోవడానికి కూడా ఆమోదం యోగ్యంగా ఉండడం అనేది మరో విశేషం. ఈ పౌరాణిక గేయాలు శాఖోప శాఖలుగా విస్తరించి జానపద సాహిత్యానికి కూడా వన్నె తెచ్చింది. లవ కుశలు రామాయణాన్ని గానం చేసినట్టు కూడా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇదీ గేయ రూపంలో ఉన్న కథ అని కూడా మనం చెప్పుకోవచ్చును. ఇంత జనాదరణ పొందిన రామాయణ మహా కావ్యం ఆనాడు భారతదేశంలో వేరొకటి లేదు. సంస్కృతం లోనే గాక జానపదులు కూడా గానం చేసి ఆనాడే జనంలోకి తీసుకుపోయారు.
జానపదంలో రసవత్తరంగా పలుక బడినటువంటి కథ రామాయణం.
ఆనాడు సంస్కృతంలోనే గాక జనం మాట్లాడుకునే అనేక భాషలలో కూడా రామాయణ కావ్యామృతం ఉందని మనకు తెలియుచున్నది. ప్రాంతీయ భాషా ప్రాబల్యానికిషకూడా ఎంతో దోహదం చేసింది.
ఆనాటి సంస్కృత సాహిత్యములో మేటి కవులైన భాసుడు, భోజుడు, భవభూతి వంటి అనేక మంది కవులు తమదైన ప్రత్యేక శైలిలో రామాయణాన్ని రచించారు. ఇలా అనేక మంది రచించడం వల్ల సంస్కృతంతో పాటు అనేక ఇతర భాషా ప్రాంతాలలో ప్రాచుర్యం పొందడం జరిగింది. ప్రజల మనసులలో రామాయణం నిలవడానికి కారణం. ప్రాంతీయ భాష భావం సంస్కృతికి అనుగుణం గా ఉండడం.
ఇక తెలుగునాటకు వస్తే రామాయణాన్ని
గోనబుద్ధారెడ్డి, మొల్ల, భాస్కర కవులు, కవిసామ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణగారు వంటి వారు, తమ విభిన్నమైన వైఖరులతో తెలుగు భాషలో రామాయణాన్ని రచించారు. మూలం వాల్మీకి రామాయణమే అయిన ఎవరి దృక్పధంలో వారు రాశారు. మూల గ్రంథమైన రామాయణంలో మార్పులు చేర్పులు చేస్తూ, మనోహరంగా అందించారు. ఇదేవిధంగా జానపదులు కూడా రామాయణం మూలాన్ని విభిన్నమైన కల్పనలు చేస్తూ రామాయణ కథా సంబంధమైన
గేయాలను పాడుతూ ప్రచారంలోకి తెచ్చారు.
పిల్లలు, పెద్దలు తమ భాష భావంతో ఆస్వాదించే అవకాశం వాల్మీకి రామాయణం మూలంగా లభించిందనుట అతిశయోక్తి కాదు.
బాలల కోసం కూడా రామాయణ గాథలు రచిం పబడ్డాయి.బాలలలో పడినా శక్తిని పెంపొందించేం దుకు ఉదాహరణగా ఏక శ్లోకి రామాయణం చెప్పుకోవచ్చును:
శ్లోకం:-
ఆదౌ రామ తపో వనాది గమనం
-హత్వా మృగం కాంచనం
వైదేహి హరణం జటాయు మరణం
-సుగ్రీవ సంభాషణం
వాలి నిగ్రహణం సముద్రతరణం
-లంకాపురీ దహనం
పశ్చాద్రావణ కుంభకర్ణ నిధనం
హ్యేతద్ది రామాయణం//
ఏకశ్లోకీ భాగవతం:
ఆదౌ దేవకి దేవి గర్భ జననం గోపీ గృహే వర్థనం,్ధ
మాయా పూతన జీవితాపహరణం గోవర్థనోద్ధారణం
కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీసుతాపాలనం
హ్యేతద్భాగవతం పురాణకధితం శ్రీ కృష్ణ లీలమృతం//
ఏక శ్లోకీ భారతం:-
ఆదౌ పాండవధార్తరాష్ట్ర జననం లాక్షాగృహే దాహనం
ద్యూతే శ్రీ హరణం వనే విహరణం మత్స్యాలయే వర్తనమ్/
శ్రీమద్ గో గ్రహణే రణే విహరణం సంధి క్రియాలంబనం/
భీష్మద్రోణ సుయోధనాది మధనం హ్యేతన్మహా భారతం //
్్్
ఈ విధంగా వివిధ శ్లోకాలు అనేకం ఆనాడు బాలలకు నేర్పేవారు. వీటితో పాటు సంస్కృతంలో నీతి శ్లోకాలు ఆరోగ్య, సామాజిక శ్లోకాలు బాలలకు నేర్పడం జరిగేది. సంస్కృతభాషను చదవడంతో పాటు వ్రాయడం అలవడేది. భాషా పాండిత్యానికి పునాదులు వేసే వారు. సంస్కృతంలో కూడా అనేక గ్రంథాలు, బాలల కోసం వెలువడినాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి