యుగాది;-శ్యామల దేవి
నక్షత్రాగమనమున కాది యుగాది
సృష్ట్యారంభమున కాది రోజు
ఆయనద్వయ సంయుతము
ఉత్తర దక్షిణాయణములకు
జడప్రాయమైన జగత్తుకు చైతన్యం
కలిగించి
క్రొంగొత్తాశయముల నంకురింప జేయు  శుభదినము
వసంతాగమనం, శశిరానికి వీడ్కోలు
కలకోకిలాల కూజితాల మధురస్వనములు సుప్రభాతాన
అమ్మ మధురమైన పిలుపుతో
మేలుకొలుపు
తైలాభ్యంగన స్నానం, నూతన వస్త్రధారణ
భగవధ్యానం నింబకుసుమ భక్షణం
పంచాంగ శ్రవణం
అందు పొందు శుభాశుభముల
విని
సుఖమునకు పొంగక కష్టమైనకు కృంగక
స్థితప్రజ్ఞతకు మారురూపమై మనిషి
చరించు అను
సమభావనకు ప్రతీక ఉగాది పచ్చడి
తీపి పులుపు వగరు కారం ఉప్పు ల
సమ్మేళనం
పచ్చడి సేవనం ఆరోగ్య పుష్టికి సంకేతం
పంచాంగ శ్రవణం ఉత్తరోత్తర కలుగు
మంచి చెడులకు సంసిద్ధత
పండుగలు సంస్కృతికి వారధులు
పలువురికి 
సంస్కారం పంచుతూ అందరినొక్క
చోట కలుపు
మన భారతీయ సంస్కృతి బహు చక్కనిది.


కామెంట్‌లు