గురువుగారు (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
జ్ఞానజ్యోతి మా పాఠశాల 
విజ్ఞానజ్యోతి మా గురువుగారు !! 

మీరు నేర్పిన ఆట పాటలు 
మీరు నేర్పిన కళాసంస్కృతులు 
నీతి సూత్రములు సంప్రదాయములు 
భక్తిశ్రద్ధలతో నేర్చెదము
ఆచరించి చూపెదము 
చక్కని విద్యార్ధులమై నిలిచెదము !!

మీరునేర్పిన శాస్త్రజ్ఞానం
మీరునేర్పిన భాషాజ్ఞానం
మీరు నేర్పిన గ్రంథసారం
మీరు నేర్పిన దేశాభిమానం
సత్ప్రవర్తన, ప్రావీణ్యంతొ
ఉత్తమపౌరులుగా ఎదుగుతాం 
మంచి మనిషిగా రూపొందుతాం !!


కామెంట్‌లు