సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 నచ్చినట్లు..మెచ్చినట్లు....
*****
మనమంతా ఈ జీవిత రంగస్థలంపై బహు పాత్రధారులం. జీవన గమనంలో తనయ/ తనయుడు, సోదరి/ సోదరుడు, తల్లి/తండ్రి... ఇలాంటి బంధాలు, అనుబంధాలతో కుటుంబ పరంగానూ...
సమాజంలో.. స్నేహితులు, అధికారులు ,గురువులు పెద్దలు, నాయకులు. లాంటి వాటిలో మన వంతు పాత్రను పోషిస్తూ ఉంటాం.
మనిషన్నాక ప్రతి ఒక్కరూ ఇలాంటి పాత్రలేవో పోషించాల్సిందే తప్పదు.
కానీ అందులో మనసుకు 'నచ్చినట్లు'  బతుకుతున్నామా...
క్షణం క్షణం ఆత్మాభిమానం చంపుకుని ఇతరులు 'మెచ్చినట్లు' ఆయా పాత్రల్లో ఒదిగి జీవిస్తున్నామా... అనేది ముఖ్యం.
జీవితం చాలా చిన్నది. అందులో మనసు చంపుకుని,వ్యక్తిత్వాన్ని వదిలేసుకుని బతకడమంత దుర్భరం ఇంకొకటి లేదు.
కాబట్టి  మనకు నచ్చినట్లుగా  విలువలతో కూడిన పాత్రను బాధ్యతాయుతంగా పోషిస్తూ  జీవిద్దాం.
అప్పుడే మనకు అసలైన గౌరవం , ఆనందం లభిస్తాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు