ఎండాకాలం సమస్యలు.; పి . కమలాకర్ రావు

కంటి ఆరోగ్యాన్ని కాపాడే కమలాపండు....
తీవ్రమైన కిరణాల వేడి వల్ల అన్నిటికన్నా ముందు కళ్ళ పై
ప్రభావం పడుతుంది. కళ్ళు అలసి
పోతాయి. ఇది తట్టుకోవడానికి
చాలామంది నల్లని కళ్ళ జోడు
ఎండల్లో తిరిగేటప్పుడు ఉపయోగిస్తారు. ఇది కూడా కొంత వరకు మేలు చేస్తుంది. కళ్ళల్లో వుండే సున్నిత మైన నరాలకు ( Optic nerves)ఎండ వల్ల
హాని కలగ కుండా చూసు కోవాలి.
   కొన్ని తాజా కమలా పళ్ళు తెచ్చి
రసం తీసి, అందులో వేయించిన
జిలకర పొడిని కలిపి, తగినంత
మంచి తేనెను కూడా వేసి బాగా
కలుపు కోవాలి. ఎండలో తిరిగి వచ్చిన వారు ఈ పానీయం  త్రాగితే చాలా త్వరగా ఆలసట
తగ్గిపోతుంది.  Vitamin C తో పాటుగా vitamin A కూడా ఉండడం వల్ల ఇది కంటి ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుంది.
ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్త హీనత (Anemia) రానివ్వదు. 

కామెంట్‌లు