వేమన పద్యాలు -అర్థాలు ;-ఏ.బి ఆనంద్ఆకాశవాణి.

 గురూజీ అన్నిటికీ సమాధానం చెబుతున్నారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదు. మీ కులం ఏమిటి అని అడిగాను కదా అంటే వేమన  ప్రశ్నించే వారికి ఆ ప్రశ్న అర్థం కావాలి? కులము అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఎందుకు తెలియదు స్వామి జాతి, మతం లాగానే కులం. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా కొత్త ఏముంది అనగానే పకపకా నవ్వి వేమన మహాశయులు  ఎడ్డి, మడ్డి కులము రెడ్డి కులము నాది అని సమాధానం చెబితే  తెల్లమొహం వేశాడు. ఎడ్డి, మడ్డి అంటే సుచి శుభ్రం లేనిది అని అర్థం ఎవరైనా నాది ఇలాంటి కులము అని చెప్పుకుంటారా అందుకే వీరిని పిచ్చి వేమన అంటారు అని నవ్వుకున్నాడు పాపం. మనకు  ఘనము, ద్రవము, వాయువుని మూడు పదార్థాలు ఉన్నాయి.ఒక దానికి ఒక దానికి సంబంధం లేదు. ఒకవేళ అవి కలిసి ఉంటే దానిని విడదీసే సామర్థ్యం మనకు ఉన్నదా?
నువ్వులు కానీ, వేరుశెనగ కానీ  గానుగ ఆడితే దానిలో ఘనము, ద్రవము కలిసే ఉంటాయి. ఆ మొత్తాన్ని ఒక పాత్రలో వేసి  దానిని కదలకుండా ఉంచుతారు.  చాలా సేపు అయిన తర్వాత  ఘన పదార్థం మడ్డి అడుగున చేరుకుంటుంది, ద్రవపదార్థం నూనె పైకి తేలుతుంది. ఈ ఘన పదార్థంలో ద్రవ పదార్థం లేదా? ఈ ద్రవ పదార్థంలో వాయు పదార్థం లేదా?  వాటిని నీవు విడదీయ గలవా  రెడ్డి అంటే అసలు అర్థం కంటికి కనిపించేది అని. ఈ ప్రపంచంలో ఉన్న కులాలను మూడు రకాలుగా విభజించారు సాత్వికము, రాజసము, తామసము అని  తల్లి గర్భంలో  బిడ్డ పెరుగుతున్నప్పుడు  ఆ బిడ్డ ఏ స్థితిలో వున్నదో ఎలా తిరుగుతుందో ఏం చేస్తుందో ఆ  తల్లికైనా తెలుస్తుందా?  అక్కడ పదార్థం ఉంది కానీ మనకు తెలియదు దానిని సాత్వికము అంటారు. నవమాసాలు నిండిన తర్వాత  ఆ బిడ్డ తల్లి గర్భాన్ని చీల్చుకొని భూమి మీదకు వస్తోంది. వస్తు రూపంలో మనకంటి ముందు నిలుస్తుంది  దానిని రాజ్యస పదార్థం అని అంటాము  అది పెరిగి పెద్ద అయిన తర్వాత ఎదుటి వారిని హింసించి, బాధించే మనస్తత్వం కలిగిన వారిని  తామసి అంటారు. ఈ గుణాలను ఎలా నిర్ణయిస్తారు  నీవు చేసే పని వల్ల స్వతః సిద్ధంగా నీకున్న గుణాన్ని చూసి దీనిని నిర్ణయిస్తారు.  దీనినే గీతాచార్యుడు కూడా గుణ, కర్మ విభాగశః అంటాడు.  మనిషిని చూడగానే అతని తత్వాన్ని మనం అంచనా వేయలేం  అతడు చేసే పనుల ద్వారా అతని తత్వం ఏమిటో మనం చెప్పవచ్చు అలాగే  మనీషా కలిగినవాడే (మనీషా=బుద్ధి)  మనిషి  అని అంటాము. మనిషిగా జీవించాలి అంటే  నిన్ను నీవు తెలుసుకొని  నీలాగానే ఎదుటివారిని కూడా చూస్తూ  సమాజంలో ఒకడిగా  బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి  అప్పుడే దేశం బాగుపడుతుందని వేమన  సిద్ధాం
కామెంట్‌లు