ధరణి బిడ్డలు తరువులు(మణిపూసలు)-ఎడ్ల లక్ష్మి సిద్దిపేట
పుడమి తల్లి బిడ్డలు
అడవిలోని తరువులు
ఎదగ నీయరెందుకు
గొడ్డలితో దెబ్బలు

అడవిల నుండు జీవులు
ఆగమైనా ప్రాణులు
అడవి జంతువులకు
కరువైన నివాసాలు

 ఊరు వీధిలోన చేరి
 ఇండ్లలోకి వచ్చి దూరి
బల్ల మీది కెక్కి యది
మిటమిటమనీ చూసు మరి

చెట్లు కూల్చివేసి చూడు
గాలి లోన దుమ్ము తోడు
తేమలేని గాలి తోడ
వాన లేము పడవు నేడు

చెరువుకుంట లెండిపోయి
పంటచేలు మండి పోయి
తిండి కరువు దండి గుండు
ముందు యున్న కాలమోయి


కామెంట్‌లు