వేమన పద్యాలు -అర్థాలు ;-ఏ.బి ఆనంద్ఆకాశవాణి.

 విశ్వదాభిరామ వినురవేమ అన్న పద్యం వినగానే  ప్రజాకవి వేమన రాసిన ఆటవెలది అని అందరికీ అర్థమవుతుంది. అయితే ఇవి ఎవరికి రాశారు? ఎవరు వినడానికి? వినుర వేమ  రాసిన కవి వేమన. వేమన  అంటే మీకు అర్థం కాదు  కనుక నేనే చదువుకుంటాను అనే అర్థంలో మాట్లాడుకోవచ్చు. చాలామంది ఎలా వ్యాఖ్యానం చేస్తారంటే  విశ్వదా అన్న వేశ్యతో సంపర్కం ఉన్నది కనుక ఆమెను గుర్తు చేయడానికి. బంగారు విద్య నేర్పిన అభిరాముడు కంసాలి  పరసువేది ఆయనకు చెప్పాడని ఒక కథ  కనుక అతని పేరు రాశాడు అని చెప్తారు. మాంసం తిన్న వాడు బోమికలు మెడలో వేసుకు తిరుగుతాడా సమాజంలో ఒక చెడ్డ పని చేసిన వాడు చెడ్డ పని చేశాను అని చెప్పు కుంటాడా  అది సరైంది కాదని నా ఉద్దేశ్యం. అసలు విషయం ఏమిటంటే విశ్వం అంటే జగతి అన్ని ప్రపంచాలు కలిస్తే అది జగతి అవుతుంది.  ఈ జగతిలో ఉన్న అరిషడ్వర్గాలను ఇచ్చాను జగతిలో ఎన్ని మనస్తత్వాలు ఉన్నాయో వాటి గుట్టు బయట పెట్టాను అభిరామ్ లో అభి అంటే మళ్ళీ మళ్ళీ  రామ అంటే అంకిత భావం  నా పద్యాలు చదవాలనుకుంటే పాటికి పది సార్లు దాని మీద శ్రద్ధ పెట్టి అంకితభావంతో చదివితే  అప్పుడు కొంచెం అయినా అర్థం అవుతుందేమో అని వారి అభిప్రాయం. అలాంటి వాటిని దానిని పట్టుకొని భౌతికమైన విషయాలకు ముడిపెట్టి అలా చెప్తారు ఎన్నో అభాండాలు వేస్తారు దానిని  ఎవరైనా నమ్ముతారా. వేమః అంటే మగ్గము అంటే సాలీడు ఒక బట్ట నేయాలి అనుకుంటే  పొడుగు, పేక ఉంటాయి. దార సమూహాన్ని బారుగ ఉంచి ఒక్కొక్క దారాన్ని మధ్యలో అల్లుతూ ఉంటాడు  అంటే ప్రతి విషయంలోనూ అడ్డంకులు వస్తూనే ఉంటాయి  దానిని దాటి ముందుకు వెళ్ళిన వాడు  జీవితంలో విజయాన్ని సాధించిన వాడవుతాడు అని వారి అభిప్రాయం. బట్టలు నేసి దానికి రంగులు అద్ది ప్రజలకు పంపిస్తాడు. తను నేసిన తెల్లటి వస్త్రానికి ఎరుపు  రంగు వేసి సాత్విక ప్రవృత్తి కలిగిన వారికి ఇస్తాడు. కాషాయం రంగు వేసి సన్యాసులకు ఇస్తాడు, ఇలా ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క  మనస్తత్వం ఉంటుంది.దాన్ని చక్కగా ప్రజలకు అందించిన వాడు మహానుభావుడు వేమన. కనుకనే ప్రజాకవిగా ఆయన  ప్రజలలోకి దూసుకెళ్లారు. ఇంతకాలం ప్రజల నాలుకపై నిలిచి ఉన్న వేమన కలకాలం అలాగే నిలిచి ఉంటాడు అనడంలో ఎలాంటి  సందేహము లేదు.
కామెంట్‌లు