ఎండాకాలం సమస్యలు.; -పి . కమలాకర్ రావు

 శరీరంలో నీరు తగ్గడం -నివారణ
ఎండాకాలంలో శరీరంలోని నీరు త్వరగా తగ్గిపోతుంది. నీటి శాతం మరీ ఎక్కవగా తగ్గిపోతే నీరసం
ఆవహిస్తుంది. నాలుక పిడచకట్టుకు పోతుంది. దీనినే
Dehydration సమస్యగా చెప్తారు.
ఈ పరిస్థితిని అంత తేలికగా తీసుకోకూడదు. లవణ సముదాయం తగ్గిపోతే కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది .
అల్లం ముక్కల పై పొట్టుతీసి మెత్తగా దంచి రసం తీసి పెట్టుకోవాలి. పూదీనా ఆకులను కూడా కడిగి దంచి రసం తీసి, అల్లం రసంలో కలుపు కోవాలి.
వేడి చేసి చల్లార్చిన మంచి నీరు కూడాకలిపి, చివరగా బెల్లం, నిమ్మరసం పిండి బాగా కలిపి
మెల్ల మెల్లగా త్రా గించాలి.
కాసేపట్లో నీరసం తగ్గి మామూలు
స్థితికి వస్తారు.
మందుల షాపుల్లో దొరికే Electral powder,O. R. S rehydration
Powder కూడా నీళ్ళల్లో కలిపి
ఇవ్వవచ్చు.
కామెంట్‌లు