"నీ జ్ఞాపకం నాతోనే"1980(ధారావాహిక 23,వ,భాగం)-,"నాగమణి రావులపాటి "
 అలా రాహుల్ కుసుమల ప్రేమ ప్రయాణం ఒక
జ్జాపకంగా మనసును నింపుకుని ఎవరి ఇళ్ళకు
వాళ్ళు చేరుకున్నారు ....!!
తెల్లారి రాహుల్ ను కలిసింది కుసుమ  రేపే నేను
విజయవాడ వెళ్ళేది ఎల్లుండి జాబ్ లో జాయిన్ కావాలి మా ఫ్రెండ్ కు చెప్పాను మనకోసం ఇల్లు చూడమని నేను నెల రోజులలో వస్తాను ...!
రాగానే నిన్ను పేళ్ళి చేసుకుని తీసుకు వెళతాను
ఈ నెల రోజులూ నీవు జాగ్రత్తగా వుండు...!
ఈ వియోగం నెల రోజులే తరువాత నీకు నేను
నాకు నీవుగా వుందాము.....!!
ఈ లోగా ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే గణేష్ ను కలువు
నాదగ్గరికి తీసుకు వస్తాడు కుసుమా నీవు జాగ్రత్త
నీవు లేకపోతే నా జీవితం సూన్యం.....!!
ఐ లవ్ యూ కుసుమా  అని కళ్ళనీళ్ళపర్యంతం
అయ్యాడు రాహుల్ .....!!
అయ్యో ఏమిటా మాటలు ఐ లవ్ యూ టూ.! మీరు 
దిగులు చెందకండి ఎలాగోలా కాలం గడిపేస్తాను
ఆతరువాత మనం జీవితాంతం కలిసే వుంటాముగా
మీరు బాధ పడితే నాకూ కన్నీళ్ళు వస్తున్నాయి
అని కుసుమ అనగానే  సరే కుసుమా మరి నేను
వెళ్ళి రానా అని అన్నాడు రాహుల్.....!!
అలాగే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అన్నది షేక్ హ్యాండ్ ఇచ్చి బెష్టాఫ్ లక్ చెప్పింది
కుసుమ...! కాసేపు మైనం రాజ్యమేలింది.....!!
రాహుల్ తేరుకుని అలాగే డియర్ త్వరలోనే
మనం కలుసు కుంటాం అని ఒకరి కళ్ళలోకి 
ఒకరు ఆరాధనా భావంతో చూసుకున్నారు?(సశేషం)
ఇక్కడి నుండి కధ మలుపు తిరుగుతుంది
రాహుల్ కుసుమలు మళ్ళీ కలుసుకుంటారా
లేదా?? ఏం జరుగుతుంది కుసుమ ఏం చేయ
బోతోంది ? తప్పక చదవండీ "నీ జ్జాపకం నాతోనే"

కామెంట్‌లు