"శాస్త్రసాంకేతికత-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-చరవాణి:- 6300474467
 01.
ఆ.వె.
నేటిమానవుండుపోటీప్రపంచాన
పరుగులిడుచునుండిపలువిధాల
యంత్రములనువాడియాంత్రికశైలితో
భువినిబ్రతుకునీడ్చుబుద్ధిజీవి!!!

02.
ఆ.వె.
శాస్త్రజ్ఞానరంగసంపదలొందియు
వివిధశోధనలనువిస్తృతముగ
చేసి,ప్రతిభజూపిచేయూతనందించు
తనకుతానెసాటిధన్యశీలి!!!

03.
ఆ.వె.
అద్భుతముగప్రతిదియాలోచనలుజేసి
శాస్త్రవేత్తలంతసముచితముగ
క్రొత్తదనముతోడనిత్తెముకనుగొని
మానవాళిగాచుమరువకుండ!!!

కామెంట్‌లు