మణిపూసలు ;-చైతన్య భారతి పోతుల హైదరాబాద్--7013264464

 176.
సంసార సాగరమిది.
బాధ్యతలెన్నో కలది.
ఈది దరికి చేరాలి. 
దీనిలొ మోక్షమున్నది.
177.
బతుకంటేనే పోరు.
సాగించాలిక జోరు.
ఉపాయం తెలుసుకొని 
సుఖాల తీరం చేరు.
178.
రామాయణ గ్రంథము.
రసరమ్యo కావ్యము.
సీతారాముల చరితను 
వాల్మీకి విరచితము.
179.
రఘురాముని ఆదర్శము.
సకల గుణ సమ్మేళనము.
కమనీయ కరుణ రసం 
ఎదనుప్పొంగే భావము.
180.
పరదూషణ చేయబోకు 
రెచ్చగొట్టుట ఎందులకు ?
మనసు విరుచుట సులభమే 
గాయం మాన్పుట కష్టము
181.
ద్వేషమే కడు విషము
ప్రేమనె అమృతమయము
నిలువున దహించేయును 
తెలుసుకుంటె మోదము
182.
అమ్మ అను అర్థనాదము
మూగప్రాణుల శోకము
కసాయిగా చంపేస్థిరి 
కదిలించే నా హృదయము
183.
జిహ్వ చాపల్యము కొరకు
ప్రాణము తీయుట ఎందుకు
కడవరకు బతకనిస్తూ 
తోబుట్టువులని మరువకు
184.
కనికరము లేని వాడవు
నీతులెన్నొ చెప్పగలవు
ప్రాణం పోయగలవా ?
పెట్టు పాపాలకు సెలవు
185.
చరాచర సృష్టి యందు
పరమాత్మ దృష్టి కలదు
జీవితం శాశ్వతమా ?
నీ వెంట ఏమి రాదు
186.
వాయిదాల పర్వము
మనుషి మనస్తత్వము
విడిచిపెట్టు నిర్లక్ష్యo 
పట్టూ  సంకల్పము
187.
అతిగ నీవ్  మాట్లాడకు
ఆవేశo  చూపబోకు
మనసుల గాయపరచే 
రాక్షసానందం నీకు 
188.
కొందరు అతి లౌకికము
చిన్నచిన్న తాయిలము
మాయలో పడేస్తారు 
ఎరుగూ నీవా నిజము
కామెంట్‌లు