తిండికి తిప్పలున్నాయి
పడుతున్న కష్టాలు
పనిలో ముప్పులున్నాయి
విడిపోని పుట్టుమచ్చలు
కత్తిపోటుకు గురైతే
ఒకేసారి చస్తాడు
అనుమానానికి గురైతే
అనుక్షణం చస్తాడు
చిగురాకు కొమ్మల్లో
కోయిల ఉయ్యాల
సింగారపు గాలుల్లో
పక్షుల జంపాల
పచ్చని వదువరులను
ఏకంచేస్తుంది మాంగళ్యాం
సంసార బంధాలను
నడుపుతుంది దైవం
అక్షరాల పదముల
మల్లెల అల్లికలు
అర్ధపు బావాల
అమృతపు మాలలు
రాసమొళ్ల చంద్రయ్య
అప్పాయపల్లి నాగర్‌కర్నూల్ జిల్లా
7981781349
26/5/2022
నా హామీ పత్రము
మెరుపులు ప్రక్రియలో
ఐదు కవితలు నా సొంతముగ రాశానని
నేను మీకు హామీ ఇస్తున్న
--------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి