గుర్రాల మణిపూసలు.;- గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.9491387977.
61) పిల్లలు కల్లలెరుగరు
      తలబిరుసుగా తిరుగరు
      అల్లరి చేయరు వారు
       మనకు దూరం జరుగరు !

62). పిల్లల లేత బుగ్గలు
        ఎర్ర గులాబి మొగ్గలు
        నిమిరితే కందిపోవు
         సంతసించే సిగ్గులు !

63 పిల్లలు మరుమల్లెలు
     కురిసే విరిజల్లులు
     సిగ్గులు చిందిస్తారు
   మ్రోగుతున్న మువ్వలు!

64). పుట్టిన పసి పిల్లలు
       శ్రీ దేవి రూపాలు
       మన పాపలు వారిక
       వారు చిరంజీవులు !

65) చిత్రమైనది జీవితం
      అది అవుతుంది పునీతం
      అనుభవాల నేర్పుతది
      చేస్తుంది ప్రభావితం !

కామెంట్‌లు