బుల్లి ఉడత తోక ఎత్తి ఆనందంగా ఎగురుతూ పెడుతోంది "ఆహా!అందమైన నా కుచ్చుతోక!ముద్దు ముచ్చటగా బొద్దుగా ఉంది నాతోక! ఎంచక్కా పైకి ఎత్తి ఎగురుతాను!అటూ ఇటూ గెంతుతాను". ఇంతలో ఓపంది దాని కంట పడింది. "ఓమావా!నీది అంత పెద్ద శరీరం!కానీ బుల్లి బెత్తెడు కూడా లేదు నీతోకం! గుండ్రంగా చుట్టుకుంది.నాతోక చూడు కుచ్చుగా ఉంది. నాతోక వెంట్రుకల తో చిత్రాలు గీసే బ్రష్ తయారు చేస్తారు తెలుసా?" హూ ..అని నిట్టూర్పు విడుస్తూ అంది వరాహం" నా బుల్లి తోకే నాకెంతో ముద్దు!". అంటూ మూతిముడిచింది.గంతులేస్తూ ఉడుత బురదగుంటలో ఉన్న కప్ప దగ్గరకు వెళ్లి " బెక బెక కప్పన్నా!ఇప్పుడే తిన్నా పప్పన్నం! నీకసలు తో కే లేదేంటిరా కన్నా? చూడు నాముద్దు బొద్దు తోకను!"అని రాగంతీసింది."పోనీలే! తోకతో నాకేం పని?" బురద తుప్పర్లు ఎగిరిపడేలా గెంతింది.ఆచిందిన బురదనుగడ్డిలో దొర్లి శుభ్రం చేసుకుంది.అక్కడే పరుగులు తీస్తున్న కుందేలుని పలకరించింది " చెవులపిల్లి మామా! నీతోక కన్నా నాది ఎంతో మిన్న!"కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది."నాతోక నాకెంతో ముద్దు! నీతోక గోల నాకేల?"అని మొహం చిట్లించి పరుగెత్తింది.బుల్లి ఉడుత కి అందాల వన్నెల పొడవాటి పింఛం ఉన్న మయూరం కనపడగానే దాన్ని పొగడసాగింది"అందాల నెమలిబావా!నాతో ఆడుకోను రావా? నీతోక ముందు నాది బలాదూర్! నీపింఛాన్ని నెత్తిన పెట్టుకున్నాడు శ్రీ కృష్ణ పరమాత్మ!నెమలి నాట్యరాణి అనే బిరుదు!భారతదేశానికి జాతీయ పక్షివి!నిన్ను చూడాలని పరుగులు పెడ్తారు"ఇలా తెగ పొగుడుతూ ఉన్న ఉడత మాటలు విని నిర్లిప్తత తో అంది"హు ..ఈఅందం నాకాళ్ళ కి బంధం!దుష్ట మానవులు నా ఈకలు పీకి నన్ను వండుకుతింటారు.ఈతోక ఎందులో నన్నా చిక్కుకుంటే నాబతుకు ఖతం"అని తోకను ఈడ్చుకుంటూ ఏడుస్తూ పోతున్న నెమలి మాటలు విన్నాక ఉడుత కి జ్ఞానోదయం ఐంది. అందం వల్ల నష్టాలు ఎక్కువ. ఉపయోగపడే అవయవాలు ఉంటే చాలు!అని సంతృప్తిగా చెంగుచెంగున గంతులేస్తూ ఆడసాగింది ఉడుత 🌹
ఉడుత ఊహ! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి