సునంద భాషితం;-; వురిమళ్ల సునంద, ఖమ్మం
 కలత...నలత....
******
 మనిషన్నాక చుట్టూ ఉన్నవారితో, బంధాలూ, అనుబంధాలతో చిన్నవో పెద్దవో పేచీలు, గొడవలు,మాట పట్టింపులు వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు మనశ్శాంతి కరువవుతుంది.
  ఏం చేయాలో తోచక, జరిగిన సంఘటనలను జీర్ణించుకోలేక, సరైన పరిష్కారం దొరక్క మనసు కలత పడటం అనేది సహజాతి సహజం.
అలాగని అదే ధ్యాస పెట్టుకుంటే  మనో వ్యాకులత ఎక్కువ అవుతుంది. కారణం మనం కానప్పుడు, తప్పు మనది లేనప్పుడు అంతగా కలత పడాల్సిన అవసరం  లేదు.
ఎందుకంటే ఆ కలతే ఒంట్లో నలతకు దారి తీస్తుంది.
మనసు ప్రభావం శరీరంపై బాగా చూపిస్తుంది.అందుకే "మనాదికి మందులేదు" అంటారు.
 కాబట్టి అలాంటి కలతలను కంట్లో నలకను తీసినంత తేలికగా తీసేయాలి, అప్పుడే మనశ్శరీరాలు తేలికై, ఎలాంటి నలతలు లేకుండా,ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలం.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు