ఏకోదరులు గా ధరణి పైకి వచ్చి
తల్లిదండ్రుల ఆప్యాయత అనుబంధాలను పంచుకుని
తాతయ్య నానమ్మల ముద్దు ముచ్చట్లతో పెరిగి
బాల్యంలో ఒకరికి ఒకరు తోడుగా ఆటపాటలలో
అల్లరిచేస్టలలో పాలుపంచుకున్న అన్నదమ్ముల ,అన్నా చెల్లెల బంధం జీవితాన మరువలేనిది, మరపురానిది....!!
కాలక్రమంలో జీవితగమనంలో తల్లిదండ్రులు మరుగయిన
తండ్రి స్థానంలో అన్నయ్య భాద్యతలు వహించి కష్టసుఖాలలో తగురీతిన
సలహాఇచ్చే ఆత్మీయత మరువలేనిది.
రామలక్ష్మణుల అనుబంధం లా
జీవితాంతం ఒకరికి ఒకరుగా చాగంటి వారు చెప్పిన విధంగా అన్నదమ్ములు నడుచుకుంటే వసుదైక కుటుంబం రామరాజ్యమే
అందుకే అన్నదమ్ముల బంధం ఆత్మీయత అనురాగాలకు ప్రతీక..!!
...........................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి