** నానీలు ** ;- కోరాడ నరసింహా రావు

 గొప్పతనాన్ని.... 
  ఎంతైనా మెచ్చొ చ్చు 
     లోపాలనొప్పుకోరేం... 
       అభిమాన కామెర్లు !
   ********
అభిమానించు.... 
   అభినందించు... 
     కనిపించే లోపాలు 
       లేవన్నట్టు నటించకు !
    ********
లోపాల్ని దాచి.... 
  పొగడటం కాదు !
   తప్పుల్ని ఎత్తి.... 
      చూపటమే అభిమానం!!
    *******
గుణ - దోషాలకు.... 
  పొగడ్తలే కాదు.... 
    తిట్లూ  తప్పవు !
      ఒప్పుకోవటమే గొప్ప!!
.    *******
మనిషి  అన్నాక.... 
  మంచీ, చెడులు సహజం!
    ఏవి  తక్కువ.... 
      అన్నదే  ముఖ్యం !!
    *******
కామెంట్‌లు