అదొక పండ్ల తోట. ఆ తోటలో అత్తిపళ్ళెక్కువ. ఆ పళ్ళంటే గబ్బిలాలు ఎంతో ఇష్టం. వాటిని తినడంకోసం వచ్చిన గబ్బిలాలు ఇలా మాటలు పడాల్సి వస్తుందనుకోలేదు.
నిజానికి ఆ పండ్లతోట ఓ ఎలుగుబంటిది. దాని పేరు లంబా.
పండ్లు తినడానికొచ్చిన గబ్బిలాలతో "మీరెవ్వరూ ఇక్కడ అత్తిపండ్లు తినడానికి వీల్లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపొండి. ఇప్పటికే ఏవైనా కోసి ఉంటే వాటిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపొండి. ఇంకొకసారి ఇటొస్తే ఊరుకోను" అంది ఎలుగుబంటి లంబా.
గబ్బిలాలలో ఓ పెద్దది "ఎందుకూ?" అని అడిగింది.
"ఇది నా తోట. మీరిక్కడికి వచ్చి పండ్లు తినడం నాకిష్టం లేదు" అంది లంబా.
అడవిలో ఆకలి తీర్చుకోవడంకోసం వచ్చే అతిథులను ఎవరూ అడ్డుకోరు. అభ్యంతరాలు చెప్పరు. మరి ఎందుకీ ఎలుగుబంటి ఇలా మాటలంటోంది? అని గబ్బిలాలు ఆలోచనలో పడ్డాయి. అంతేతప్ప అక్కడి నుంచి వెళ్ళిపోయేలా లేవని గ్రహించిన లంబా ఓ టపాకాయను వెలిగించి గాల్లోకి విసిరింది. ఆ టపాకాయ పేలి పెనుశబ్దం చేయడంతో గబ్బిలాలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి.
ఆ పండ్లతోటకు ఎదురుగా ఒక ఛెట్టుమీద ఉంటున్న ఓ కొండముచ్చుకి ఎలుగుబంటి చర్య నచ్చలేదు.
"ఆకలి తీర్చుకోవడంకోసం వచ్చిన గబ్బిలాలతో ఇలాగేనా ప్రవర్తించడం? నువ్వు చేసింది నాకు నచ్చలేదు" అంది కొండముచ్చు?
"ఇది నా తోట. ఇక్కడ ఒక్క పండు తినాలన్నా నన్ను అడగాల్సిందే. నా అనుమతిలేకుండా ఏ ప్రాణీ ఈ తిటలోకి రాకూడదు" అన్నాది లంబా.
“ఆకలి అందరికీ వేస్తుంది. ఆకలి తీర్చుకోవడంకోసం మన అడవిలోకి వచ్చే వాటిని అడ్డుకోవడం అనేది లేదే. పండ్లు రాలిపోయి వృధా అవుతుంటాయి. అలా రాలిన వాటిని తినడానికొచ్చిన వాటిని గబ్బిలాలు తింటే నీకు నష్టమేమిటీ?" అని అడిగింది కొండముచ్చు.
ఈ సంఘటన జరిగిన కొం త కాలం తర్వాత ....
ఓరోజు లంబా ఎలుగుబంటి తోటలో ఓ అడవిపంది అరుపు వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళింది కొండముచ్చు.
లంబా అడవిపందిని ఓ చెట్టుకి కట్టేసింది.
"ఎందుకు కట్టావిలా?" అడిగింది కొండముచ్చు ఎలుగుబంటిని చూసి.
"ఇంకేముంది? నా అనుమతి లేకుండా నా తోటలోకొచ్చి నేను నిల్వ చేసిన దుంపలను తింటోంది" అన్నాది లంబా.
కొండముచ్చు ఎన్నో మంచిమాటలు చెప్పి మొత్తానికి ఎలుగుబంటి లంబాతో కట్టు విప్పించి విడిపించింది అడవిపందిని.
ఓరోజు కొండముచ్చు తన పిల్లలతో ఓ గుట్ట మీద ఆడుకుంటోంది.
అప్పుడు లంబా ఓ పెద్ద తేనెతుట్టను భుజం మీద వేసుకుని వస్తోంది.
దానిని చూసిన కొండముచ్చు "ఆకలితో వచ్చే వాటినేమో నువ్వు నీ తోటలోంచి తరిమికొడతావు. నానామాటలంటావు. కొనీ నువ్వు మాత్రం తేనెటీగలు ఎంతో కష్టపడి సేకరించిన తేనెతుట్టను నువ్విలా తీసుకురావచ్చా?" అని అడిగింది.
కొండముచ్చు ప్రశ్నకు ఎలుగుబంటి లంబా జవాబు చెప్పలేకపోయింది. ఎందుకంటే అది అక్రమంగానే తేనెతుట్టను తీసుకొచ్చింది కనుక.
అయినా సర్దుకుని "నీకో పెద్దరికమివ్వడంతో నువ్విలా అడగటం బాగులేదు" అంది ఎలుగుబంటి.
అప్పుడు కొండముచ్చు "నీకు గుర్తుందా? ఓరోజు నువ్వు ఓ బురద గుంటలో చిక్కుకున్నప్పుడు నిన్ను కాపాడి బయటకు తీసింది మేమే. అప్పటి నుంచేగా నువ్వు మాతో సఖ్యంగా ఉంటున్నావు. లేకుంటే మమ్మల్నీ నువ్వు తరిమికొట్టే ఉంటావు. అదలా ఉంచు. ఏమైనా నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ప్రశ్నించడం తప్పా? సరే. నీకిష్టంలేదంటే ఈరోజు నుంచే నీతో మాట్లాడటం మానేస్తాం. మా మానాన మేముంటాం....ఏమైనా అనుకో. నీలాంటి స్వార్థపరురాలిని నేనిప్పటిదాకా చూడలేదు. నీలాగే మేమూ ఉండి ఉంటే ...ఒక్కసారి ఊహించుకో...నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మేము పట్టించుకోకుండా ఉండి ఉంటే ఏమయ్యేదానివో" అంటూ వెళ్ళిపోయింది.
ఎలుగుబంటి లంబాకు అప్పటికి తెలిసొచ్చింది తనెంత తప్పు చేసానో అని.
క్షమాపణలు అడగడానికి కొండముచ్చు దగ్గరకు బయలుదేరి వెళ్ళింది ఎలుగుబంటి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి