ఆనాటి విదేశీయుల వ్యక్తిత్వం!;-సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
  అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ గార్నర్  బేస్ బాల్ ఆటలో ఓడిపోయి  విజేత కి 10డాలర్లు ఇచ్చాడు."సార్!దీనిపై మీసంతకం పెట్టండి. దీన్ని నామనవడికిస్తాను" అన్నాడతను."ఓహో!దీన్ని ఖర్చు పెట్టకుండా  దాస్తావా?"అని చెక్కుపైనే సంతకం పెట్టాడు గార్నర్. 
కృశ్చెవ్ రష్యా ప్రధాని గా ఉన్న రోజుల్లో  అక్కడ మనరాయబారి టి.ఎన్.కౌల్ ఇలా రాశారు. కృశ్చెవ్ తొలిసారి సైబీరియా యాత్ర చేస్తూ ఓ90ఏళ్ల వృద్ధుడిని కలిశాడు."తాతా!అక్టోబర్ విప్లవంకి ముందుకన్నా  ఇప్పుడు నీజీవితం సుఖంగా ఉందా?" దాని కి  తాతజవాబు" నేను ఎప్పుడు సుఖంగా ఆనందంగా ఉన్నానో నాకే తెలీదు. ఆరోజుల్లో నాకు అన్నీ రెండేసి జతల షూస్ ఓవర్ కోట్లు  సూట్లు ఉన్నిహాట్స్ దస్తీలు ఉండేవి. ఇప్పుడు నాదగ్గర నేను ధరించినవే ఉన్నాయి."  "పోనీలే తాతా! ఆఫ్రికా  దక్షిణ అమెరికా భారతదేశం లో  ఈఒక్కటీ లేని అర్ధ నగ్న  దిగంబరంగా తిరిగే పిల్లలు ముసలి ముతక ఉన్నారు తెలుసా?" దానికి తాత స్పందన ఇది"అవునా బాబూ! మన అక్టోబర్ విప్లవం కన్నా ఆప్రాంతాల్లో ముందే విప్లవం వచ్చింది అన్న మాట!!" పాపం కృశ్చెవ్ నోటి కి తాళం పడింది.
మార్టిన్ లూథర్ కింగ్ ఉపన్యాసం ఇస్తుండగా ఎవరో కాలిబూటు విసిరారు. అదిసరిగ్గా ఆయన మొహాన్ని తాకి కింద పడింది. ఎంతో ప్రశాంతంగా ఇలా అన్నాడు "కాలిజోడు లేకుండా తిరుగు తున్న నాపై ఎవరికో జాలి సానుభూతి కలిగింది. దయచేసి ఇంకో బూటు విసిరితే నాకు ఉపయోగం!"అంతే సభంతా నిశబ్దం!వర్ణ వివక్షత  సాగుతున్న రోజుల్లో జరిగింది ఇది.
హాస్యనటుడు ఛార్లీ ఛాప్లిన్ కొడుకు కి  బాగా జబ్బు చేసింది.డాక్టర్ ఇచ్చిన సలహాఇది"నీకొడుకుని  అనుక్షణం మాటలతో  నవ్విస్తూ ఉంటే  త్వరగా కోలుకుంటాడు." ఆరోజుల్లో ఛాప్లిన్  నటుడిగా మహా బిజీ!అందుకే  తన మిత్రుడ్ని కొడుకు దగ్గర ఉంచాడు.ఎవరో అడిగారు"అందరినీ నవ్వించే నీవు నీకొడుకుని చూసుకోలేవా?"అతని  జవాబిది"ఒక్క రోజు నేను షూటింగ్ కి వెళ్ళకపోతే వేలాది డాలర్లు నష్టం నాకు  సినీ రంగానికి! నాబాధ నా ఫ్రెండ్ కి తెలుసు." నిజమే ధనంమూలం ఇదం జగత్!
అమెరికన్ ప్రెసిడెంట్ జాన్.ఎఫ్.కెనడీ బావమరిది సార్జెంట్ షివర్స్. అతను  తన 5ఏళ్ల కొడుకు తో" బాబూ! బాగా చదువుకుని  గొప్పవాడివి కావాలి. నీవయసులో అబ్రహాంలింకన్ 12మైళ్ళున్న బడికి నడిచి వెళ్ళే వాడు"అని చెప్పాడు. దాని కా చిచింద్రీ ఠక్కున నిలదీశాడు" నాన్నా! మరి మామ జాక్ నీవయసు వాడే కదా?మరి మామ అమెరికన్ ప్రెసిడెంట్!మరి నువ్వో!?"ఆచిన్నారికి దేశం పట్ల అవగాహన ఉండటం ముదావహం!
స్టాలిన్ కడు దుర్భరదారిద్రం లో పుట్టి పెరిగాడు. ఆందోళన కారులతో కల్సి రష్యన్ రాజకీయ నేతగా ఎదిగాడు.లెనిన్ చని పోయిన తర్వాత తన శత్రువు లందరినీ  నిర్దయగా అణిచేశాడు.ప్రముఖ గూఢచారుల ద్వారా విషయసేకరణ చేసేవాడు. వారి ని కూడా నమ్మకుండా తనే రంగంలోకి దూకేవాడు.ఓసారి"స్టాలిన్ క్రూరుడు!మహాస్వార్ధపరుడు! అబద్ధాలకోరు.."ఇలా కరపత్రాలు  అవాకులు చెవాకులు అన్నిచోట్ల  కనపడ్తే గూఢచారి లీడర్ వాటిని సేకరించి స్టాలిన్ ముందు పెట్టాడు. వాటి ని  చూస్తూ అడిగాడు "ఇలా ఎవరు నాపై రాసి పంచి దుష్ప్రచారం చేస్తున్నారు?" ఆగూఢచారి జవాబు ఇది"అలాచేసే ధైర్యం దమ్ము కేవలం స్టాలిన్ కే ఉంది సర్!" ఆజవాబుతో డంగైపోయాడు. తనే స్వయంగా అలాచేసి గూఢచారుల కి పరీక్ష పెట్టాడు.!?

కామెంట్‌లు