కడుపు ఉబ్బరం (Gastritis); -పి ; కమలాకర్ రావు
 పులి తేన్పులు =నివారణ.
  
భుజించిన ఆహారం సరియైన
సమయానికి అరగకపోతే కడుపులో గ్యాస్ ఉత్పత్తి అధిక
మోతాదులో తయారవుతుంది.
కడుపు ఉబ్బరానికి అదే మూల కారణం. కొందరు జీర్ణ క్రియకు అవసరమైన నీరు త్రాగరు.
మరి కొందరు ఆకలి కాకపోయినా
తింటారు.
బాగా ఆకలి వేసినప్పుడు మాత్రమే
కడుపులో పడ్డ ఆహారాన్ని అరిగించడానికి జఠర  రసాలు  సిద్ధంగా ఉంటాయి.
కడుపు ఉబ్బరం తగ్గడానికి, కొన్ని
కరివేపాకులను తెచ్చి బాగా కడిగి
నీళ్ళల్లో వేసి, కొద్దిగా శొంఠి పొడి,
చిటికెడు మిరియాల పొడి కొద్దిగా ఉప్పు వేసి
మరిగించి చల్లార్చి త్రాగాలి.  కడుపు ఉబ్బరం తగ్గి పోతుంది.
క్యాబేజి మరియు క్యారట్ ను
మిక్సీ లో వేసి రసం తీసి పరి గడుపున త్రాగినాకూడా కడుపుబ్బరం రానివ్వదు
ఒకవేళ కడుపులో మంటగా
ఉంటే తీయని మజ్జిగలో దేశీ గులాబీ రిక్కలను తీసి కడిగి మిక్సీ
లో వేసి త్రాగాలి. కడుపులో మంట
వెంటనే తగ్గి పోతుంది.

కామెంట్‌లు