ఆటవెలది రుచి చూపిన మహా యోగి వేమన. ; -ఏ.బి ఆనంద్--ఆకాశవాణిPh No-94928 11322
 ప్రపంచానికి ఆటవెలది రుచి చూపిన మహా యోగి వేమన.  ప్రపంచం- "ప్ర" అంటే అతిపెద్దదైన, "పంచం" అంటే పంచభూతములతో ఏర్పడినటువంటి శరీరం  దానికి ఎన్ని నీతులు సమకూర్చి పెట్టాడు వేమన. వారి గురించి ఎంతోమంది పెద్దలు బ్రౌన్ దొర నుంచి డా. కట్టమంచి రామలింగారెడ్డి గారి వరకు ఎందరు ఎన్ని రకాలుగా శోధించిన అసలు రహస్యం తెలియలేదు ఎక్కడ జన్మించాడు, ఎప్పుడు జన్మించాడు, ఎలా జీవించాడు అన్న విషయం నర మానవుడికి తెలియదు.  అలాంటి చరిత్ర లేని వ్యక్తి రాసిన ఆటవెలదులు చరిత్ర ఉన్నంత వరకు నిలిచిపోయాయి అంటే  విచిత్రాలలో కన్నా విచిత్రం కాదా ఇది. ఊరుకొండ వీడు ఉనికి పశ్చిమ వీధి అన్న దానిని  ఆధారం చేసుకుని అల్లిన కథలు తప్ప, నిజాలు కావు. ఉనికి పశ్చిమ వీధి అన్న   శబ్దంలో వేదాంత సారమంతా చెప్పిన జ్ఞాని. సత్యం వద- ధర్మం చర వేద సూక్తులను  ఆచరించడానికి శరీరం కావాలి కదా  ఆ శరీరాన్ని నడపడానికి గుండె ప్రధానం కదా  మానవుని పశ్చిమ వీధి  గుండె కాక మరేమిటి అది ఏం చేస్తుంది మనిషిని నడిపిస్తుంది. ఉదాహరణకు ఎవరో ఒక వ్యక్తి రోడ్డు మీద  స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు, అతడు సజీవుడో నిర్జీవుడో కూడా తెలుసుకోవడానికి  చాలామంది వెనకాడతారు. గుండె కల వ్యక్తి మాత్రమే వెళ్లి  సపర్యలు చేసి, అతని ఉనికిని తెలుసుకొని  అతనిని గమ్యానికి చేరుస్తాడు ఇలాంటి మంచి మనసు హృదయం లేకపోతే  మనిషిగా  జీవించడం వృధా కదా. నిజానికి  స్వచ్ఛమైన మనసుకు, వాడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? అది తెలియజేయడం కోసం రాసిన పద్యం ఇది. అలాంటి సాహితీ ప్రియుడైన మహనీయుని వెర్రి వేమన అన్న వారు లేకపోలేదు. వారు ఆ మాట తెలిసి అన్నారో, తెలియక అన్నారో కానీ  సరైన మాట వాడారు అని నా నమ్మకం.  వెర్రి అంటే అందరూ అనుకుంటున్న పిచ్చి అని కాదు అర్థం అంకితభావం అని, ఆ అంకితభావం లోపిస్తే వేమన మహానుభావుడు  వేదాలలోని, ఉపనిషత్తులలోని పంచ కావ్యాలలోని  నీతినంతా క్రోడీకరించి ఒక చోట ఆటవెలదిలో నిక్షిప్తం చేయగలడా మీరు కూడా ఆలోచించండి?


కామెంట్‌లు