జాతి సంపద;-గుండాల నరేంద్ర బాబు-అసోసియేట్ ఎన్.సి.సి.ఆఫీసర్,10 ఆంధ్ర నావికా దళ విభాగం, గుంటూరు గ్రూప్ ,నెల్లూరుసెల్:9493235992
బాల్యం కాదు బాధ్యతల పంజరం
కాకూడదు సమస్యల సమాహారం

బాల్యం కావాలి స్వేఛ్చా విహంగం
బాల్యం అవ్వాలి ఉత్తుంగ తరంగం

బాల్యం ఓ అందాల బృందావనం
బాల్యం ఓ ఆమని కోకిల గానం

బాల్యం కారాదు అమావాస్య చంద్రబింబం
బాల్యం కావాలి వున్నమి  నాటి శశి వదనం

బాల్యం కారాదు మోడువారిన వృక్షం
బాల్యం అవ్వాలి ఆశల మోసుల వసంతం

పలకా బలపం పట్టాల్సిన బాల్యం
పలుగూ పార పట్టడం కడు దైన్యం
 
సీతాకోక చిలుకల్లే హాయిగా గడపాల్సిన బాల్యం
ఆకలి వేటలో  చెత్త కుండీల బాటపట్టడం హీనం

బాల్యం ఓ మధుర జ్ఞాపకం
బాల్యం ఓ తీపి సంతకం
బాలలు మన జాతి సంపద
బాలలు మన ఖ్యాతి  బావుటా 

పొలాల్లో..గనుల్లో..కర్మాగారాల్లో.. 
ఇటుక బట్టీలల్లో.. భోజనశాలల్లో..
ప్రమాదకర పరిసరాలల్లో..

మగ్గుతున్న బాలల్ని బడిలో చేర్పిద్దాం
 దేశాభివృద్ధిని
కాంక్షిద్దాం 
అందాల బాల్యాన్ని అందిద్దాం

( 12 జూన్ 2022 ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా )కామెంట్‌లు
Unknown చెప్పారు…
చాలా బాగుంది sir
Unknown చెప్పారు…
మిత్ర మా చాలా బాగా చెప్పావు
ఎల్.నరసింహ ప్రసాద్