"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 50,బాగం )- "నాగమణి రావులపాటి "
 కుసుమ అడిగిన దానికి గీత కాదే నాకు రాహుల్ 
కలిసి చాలారోజులైంది నీకు తెలుసుగా మాఇంట్లో
కాఫీ నే వాడుతారని కొత్త బ్రాండ్ వచ్చిందంటే
సరే వాడి చూద్దాం అని కొన్నాను ........!!
తీరా చూస్తే కుసుమ కాఫీ దానిపై నీ ఫొటో చూసి
ఆశ్చర్యం పోయాను...దాని వివరాలు తెలుసుకుని
ఎలాగోలా నీ జాడ తెలుసుకునే సరికి నాకు 
బ్రహ్మ ప్రళయం అయింది మొత్తానికి సాధించానే
అని పాతవి నెమరేసుకుని కొత్తవి సరి చూసుకుని
ముచ్చట్లలో మునిగి తేలారు స్నేహితురాళ్ళు.....!!
అలుపెరుగని కాలానికి మలుపులు వున్నట్టే 
మనుగడ సాగించే జీవన విధానంలో ఎన్నో
ఒడిదుడుకులు మరెన్నో జీవన తరంగాల
అలజడులు అదే మానవ గమనానికి ఆనవాళ్ళు
కుసుమ వ్యాపారంలో  ఆరితేరటమే కాక ఆర్దికంగా
బలపడింది.... సమాజంలో ఒక విశిష్టమైన స్థానాన్ని
సంపాదించింది....‌ పాత ఇంటి స్థానంలో ఒక
అందమైన భవనాన్ని నిర్మింప జేసింది ఎన్ని వున్నా
తమ మూలాలను మరిచి పోక అనుక్షణం జాగ
రూకతతో వుంటూ కాలాన్ని సద్వినియోగం
చేస్తూ నలుగురిలో ఆదర్శ కుటుంబం అని పేరు తెచ్చు కున్నారు............!!
 రాహుల్ కుసుమకు చేదోడు వాదోడుగా వుంటూ
కుసుమ వాళ్ళు తమ్ముడు చెల్లి వాళ్ళకు దగ్గర అయ్యాడు రాహుల్ అంటే వాళ్ళకు ఎంతో గౌరవం
అభిమానం ఏర్పడ్డాయి....... అలా నడుచు కోవటం
రాహుల్ లోని మంచి తనానికి కుసుమ పై వున్న
 ప్రేమ కి నిదర్శనం..............!!
గీత ఉన్నట్టుండి  ఒకరోజ ఆమె బర్తతో కుసుమ ఇంటికి వచ్చింది... ఏమిటే సడెన్ సర్ప్రైజ్ అని గీతను అడిగింది కుసుమ...... అవునే నీతో
పర్సనల్ గా మాట్లాడాలని మావారితో కలిసి
వచ్చాను అని అన్నది గీత...........!!
ఏమిటే ఆ పర్సనల్ నాకు పోటీగా నువ్వు కూడా
కాఫీ బిజినెస్ మెదలు పెట్టాలని అనుకున్నావా ఏమి
అని సరదాగా అనేసరికి నాకు పెట్టాలని వున్నా
నీతో పోటీ పడొద్దని మానేస్తాను అని అన్నది గీత....!!
ఊరికే సరదాగా అన్నాలేవే రండి బోజనాలు 
అయ్యాక మాట్లాడుకోవచ్చు అని లోపలికి వెళ్ళారు 
అందరూ....బోజనాలు చేసిన తరువాత స్నేహితురాళ్ళు అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ
డాబా పైకివెళ్ళారు(సశేషం).............!!

కామెంట్‌లు