తోడుకావాలి ;-పి. చైతన్య భారతి, 7013264464
:-'కా'ప్రారంభాక్షర బాలగేయం 
======================

కాటుక కనుల పాపాయి 
కాశీ వెళ్దాం  రావోయి 
కాడ మల్లెలు  తేవోయి 
కామాక్షి మెడలో వేసేయి 

కాళ్ళ గజ్జెలు పెట్టాలి 
కాజును బాగా తినాలి 
కారుణ్య భావం నిండాలి 
కనుకలెన్నో పొందాలి 

కాకర కాయలు తెంపాలి
కాదనకుండా చదవాలి 
కాసిన పళ్ళను తినాలి
కాంచీ పురం వెళ్ళాలి 

కాగిన పాలను తాగాలి 
కాపల ఇల్లుకు పెట్టాలి 
కాజీపేటకు  వెళ్ళాలి 
కాంస్యమయిన కొనాలి 

కాపురమున్నది చిలకమ్మ
కానల గూట్లో  తానమ్మ 
కావుకావు ఓ కాకమ్మ 
కావాలోయ్ నీ తోడమ్మ


కామెంట్‌లు