👌ఉరకలను పెడుతున్న
"కోర్కెలే గుఱ్ఱాలు"!
అదుపులో నుంచాలి!
ఓ తెలుగు బాల!
(తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
👌కోరికలే గుఱ్ఱాలు వంటివి! వాటికి కళ్లెము వేసి, అదుపులో పెట్టుకోవాలి! మన ఊహలకు రెక్కలు వస్తే; అవి.. ఎక్కడ కెక్కడకో మనలను, తీసుకొని పోతాయి!అందువలన, మనమంతా.. నేలను విడిచి కర్రసాము చేయకూడదు! తస్మాత్ జాగ్రత్త!
👌మన మనస్సులో పలురకాల ఆలోచనలు కలుగుతాయి! వాటి వలన.. అనేక కోర్కెలు పుట్టు కొస్తాయి! అవి, ఎంతవరకు సాధ్యమా? కాదా? అని, ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి! తరువాత, ఒక ప్రణాళిక ప్రకారం.. కార్యసాధనకు ముందడుగు వేయాలి!
⚜️ఆటవెలది పద్యము⚜️
కోర్కె "ఎండమావి", కోల్పోకు విజ్ఞత
కోర్కె "మాయలేడి", కోరి చెడకు;
కోర్కె "తేనెతుట్టె", కోల్పోకు ఓరిమి
కోర్కె "చీమపుట్ట", కొల్లబోకు!
( రచన: శ్రీ అన్నలూరు ఉమా మహేశ్వరరావు, ఉషాకిరణాలు., )

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి