కలవాలి... పిలవాలి...
******
మన చుట్టూ అనుభవాలతో పండిపోయిన ఆదర్శవంతమైన వయో వృద్ధులు కొందరు ఉంటుంటారు.
అలాంటి వారిని అప్పుడప్పుడు తప్పకుండా కలవాలి.వారిని కలవడం వల్ల మహోన్నత వ్యక్తిత్వ జీవిత చరిత్రలను చదువుతున్న అనుభూతి కలుగుతుంది. ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది.
ఆనాటి నుండి ఈనాటి వరకు వచ్చిన అనేకానేక సామాజిక, సాంస్కృతిక మార్పుల గురించి వారి నుండి తెలుసుకోగలం.
అలాగే వారిని వీలున్నప్పుడల్లా మన ఇళ్ళకు పిలుస్తూ ఉండాలి.రేపటి తరానికి వారిని పరిచయం చేస్తూ ఉండాలి.
అలా చేయడం వల్ల తరాల అనుభవాలు ఈ తరానికి పరంపరగా అందే అవకాశం ఉంటుంది.
కాబట్టి మన చుట్టూ ఉన్న పెద్ద తరం కనుమరుగు కాకముందే వారిని తరుచుగా కలుస్తూ, గౌరవాభిమానాలతో పిలుస్తూ ఉండాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి