హడావిడిగా...
కదలక అక్కడే ఆగిన కాలాన్ని
కాస్త ముందుకు తిప్పి...
చేస్తున్న పనులన్నిటికీ
ఉన్నపళంగా టాటా చెప్పి...
గుడ్ నైట్ అంటూ
లైటును ఆపి...
అలసిన కళ్ళకు
చీకటి చూపి...
నిశిలో దాగిన వెన్నెల అందాల
గుట్టు విప్పి...
చిరుగాలులు మేనును
తాకగా వెచ్చని
దుప్పటి కప్పి...
కాసేపు అలా అలా
నిదురించడానికి
చేసిన ప్రయత్నాలన్నీ
ఫలించి...
స్టార్స్ నైట్ లో
లక్కీగా స్వప్నం
అనే గిఫ్ట్ కూపన్ ను
సాధించి...
హాయిగా పరుపు ఒడిలో
అలుపు లేని ఆనందాన్ని
పొందుతుంటే....
నా డ్యూటీ అయిపోయిందని
ఆ చందమామ
రెస్ట్ తీసుకోగా...
ఆకాశం అన్న స్క్రీన్ పైకి
సూర్యుడు సడన్ గా
ఎంట్రీ ఇచ్చుకోగా...
ఊహకు అందని
నిన్నటి కలలను
వెతకడం విడిచి...
రెండు కన్నుల
కనురెప్పలను
ఒక్కసారి తెరిచి చూస్తే...
పొద్దుపొద్దున్నే
పక్క వీడినప్పటి
నుండి పొద్దుపోయాక
పక్క మళ్ళీ ఎక్కేదాకా
మనను పలకరించేవన్నీ
పరిస్కారాలు లేని
ప్రశ్నలేగా మరి!!!!
కదలక అక్కడే ఆగిన కాలాన్ని
కాస్త ముందుకు తిప్పి...
చేస్తున్న పనులన్నిటికీ
ఉన్నపళంగా టాటా చెప్పి...
గుడ్ నైట్ అంటూ
లైటును ఆపి...
అలసిన కళ్ళకు
చీకటి చూపి...
నిశిలో దాగిన వెన్నెల అందాల
గుట్టు విప్పి...
చిరుగాలులు మేనును
తాకగా వెచ్చని
దుప్పటి కప్పి...
కాసేపు అలా అలా
నిదురించడానికి
చేసిన ప్రయత్నాలన్నీ
ఫలించి...
స్టార్స్ నైట్ లో
లక్కీగా స్వప్నం
అనే గిఫ్ట్ కూపన్ ను
సాధించి...
హాయిగా పరుపు ఒడిలో
అలుపు లేని ఆనందాన్ని
పొందుతుంటే....
నా డ్యూటీ అయిపోయిందని
ఆ చందమామ
రెస్ట్ తీసుకోగా...
ఆకాశం అన్న స్క్రీన్ పైకి
సూర్యుడు సడన్ గా
ఎంట్రీ ఇచ్చుకోగా...
ఊహకు అందని
నిన్నటి కలలను
వెతకడం విడిచి...
రెండు కన్నుల
కనురెప్పలను
ఒక్కసారి తెరిచి చూస్తే...
పొద్దుపొద్దున్నే
పక్క వీడినప్పటి
నుండి పొద్దుపోయాక
పక్క మళ్ళీ ఎక్కేదాకా
మనను పలకరించేవన్నీ
పరిస్కారాలు లేని
ప్రశ్నలేగా మరి!!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి