పగిలేది... రగిలేది...!?
******
మనసు అద్దం లాంటిదే కాదు, జ్వలించే నిప్పు రవ్వ కూడా...
మాట చిన్నదే అయినా మనసును కష్టపెట్టేదైతే, ఆ మాట అద్దంపై విసిరిన రాయి లాంటి దవుతుంది.
మనసును మళ్ళీ అతికించలేనంత ముక్కలుగా పగిలేలా చేస్తుందది.
అందుకే వేమన కవి 'ఇనుము విరిగితే మళ్ళీ అతికించ వచ్చు కానీ మనసు పగిలితే/విరిగితే అతికించలేమని' అంటాడు.
ఇక రగిలేది మనసే... ఆత్మాభిమానం దెబ్బతినేలా/ రెచ్చగొట్టే విధంగా అనే ఓ చిన్న మాట మనసును నిప్పు రవ్వలా జ్వలింప జేస్తుంది. పగ, ప్రతికారంతో రగిలి కక్షలు కార్పణ్యాలకు హేతువు అవుతుంది.
అందుకే మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి.
మనసు పగిలే,రగిలే మాటలతో ఎవరినీ గాయపరచ కూడదు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి