కుంకుమపువ్వు;- డా:కందేపి రాణిప్రసాద్

 చిన్నారులు! మీకు స్వీట్లు అంటే ఎక్కువ ఇష్టం కదా! స్వీట్ల లో వేసే కుంకుమపువ్వును చూశారా?ఎర్రగా కేసరాల్లా ఉంటుంది కదా! వీటిని పాలలో వేస్తే దాని రంగు కొద్దిగా పాలక్కూడా వస్తుంది.
ఈ కుంకుమపువ్వు గురించి తెలుసుకుందాం.
"క్రోకాస్ సెటైవస్" అనేది కుంకుమ పువ్వు యొక్క శ్రాస్థియా నామం ఇది ఇరిడేసి కుటుంబానికి చెందిన మొక్క .ఈ మొక్క ఎక్కువగా చల్లని ప్రదేశాలలో పెరుగుతుంది.కుంకుమ పువ్వు సుగంధ ద్రవ్యాల జాబితాలో చేరబడినది.ఇది ప్రపంచములోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం.మనం సాధారణంగా కుంకుమపువ్వు అని పిలుస్తాం. కానీ నిజానికి పువ్వులోని కేసరాలు మాత్రమే.కుంకుమ పువ్వు లేత వంగ రంగులో ఉంటుంది.చిన్న దుంప వేరు నుంచి మొక్క పైకి పెరుగుతుంది. ఇది చూడటానికి ఉల్లి మొక్క లేదా ఎర్రని లిల్లీ మొక్క వలె కనిపిస్తుంది.మనం స్వీట్లలో వాడేది పువ్వులోని కేసరాలు మాత్రమే.పువ్వులో ఉండే రెండు కేసరాలనే కుంకుమాపువ్వుగా వ్యవహరిస్తాం.అండకోశం పసుపు రంగుగాను పైకి ఉండే కేసరం ఎరుపు రంగులోను ఉంటుంది.ఇది ఘాటైన వాసననూ రుచినీ రంగునీ ఇస్తుంది.చిరు చెదుతో తీయగా ఉంటాయి.
కుంకుమ పువ్వును గర్భిణులు పాలలో కలుపుకొని తింటే పుట్టే బిడ్డ ఎరుపు రంగులో ఉంటాడని ప్రజల విశ్వాసం.అందువలన కుంకుమాపువ్వును గర్భిణీలు ఎక్కవగాతీసుకుంటారు.దీనివలన బిడ్డలు ఎర్రగా పడతారని శ్రాస్త్రీయంగా ఎక్కడ నిరూపించబడలేదు.ఒక కిలో కేసరాలు కావాలంటే కనీసం రెండు లక్షాల పువ్వులను కోయవలసి ఉంటుంది.కాశ్మీర్ పరిసర ప్రాంతాలలో నేలలన్నీ కుంకుమ పువ్వు సాగుతో నిండిపోయి ఉంటాయి.అక్టోబర్, నవంబర్ నెలలలో ఈ పంట ఎక్కువ పండుతుంది.పూలు విచ్చుకున్న వెంటనే కోసి వాటిలోని అండకోస భాగాలను తుంచి ఎండబెడతారు.అప్పుడే అవి మంచి వాసనతో రుచి కలిగి ఉంటాయి.కొద్దిగా ఆలస్యం అయిన పూలన్నీ వాడిపోయి వాటిలోని అందకోశ భాగాలు రంగును రుచిని కోల్పోతాయి.ఉదయం పది గంటలలోపే పూలను కోసి కేసరాలను వేరు చేయాలి.ఇదంతా కేవలం మనుష్యుల చేతి శ్రమతో చేయవలసి ఉంటుంది.ఏ యంత్రాల సహాయంతో చేయలేరు.కాబట్టే కుంకుమ పువ్వు అత్యంత ఖరీదు పలకడానికి కారణమైంది.ఒక గ్రాము కుంకుమపువ్వు సుమారు 600 రూ" వరకు ధర పలుకుతుంది.సుగంధ ద్రవ్యాలు అన్నింటిలో మనిషి మొదటగా ఆహారంలో వాడింది.కుంకుమ పువ్వునే
తినుబండరాలకు రంగును ఇచ్చే పదార్థంగాను సువసన నివ్వటానికి కుంకుమాపువ్వును వాడతారు.తాంబూల కిళ్ళీ లలో కూడా సువాసన కొరకు వేస్తారు.
కుంకుమపువ్వు జన్మస్తలం దక్షిణ ఐరోపా అక్కడి నుంచి వివిధ దేశాలకు విస్తరించింది. గ్రీస్, స్పెయున్ , సిసిలి,టర్కీ,ఇగ్లాండ్,ఇరాక్ ఫ్రాన్ష్, దేశాల్లో అధికంగా పండిస్తారు.ఇరాన్ దేశంలో కుంకుమపువ్వును అత్యదికంగా సాగు చేస్తారు. భారతదేశంలో మాత్రం కాశ్మీర్ లో  ఎక్కువగా పండిస్తారు.మన దేశం లో కుంకుమ పువ్వు అనగానే కాశ్మీర్ పేరే గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనదేశంలో కుంకుమపువ్వు పండేది కాశ్మీర్ లోనే కాబట్టి ఈ భూమ్మీద  అత్యంత ఖరిధైనది ఆకర్షినియమైనది. అంతేకాక అద్భుతమైన ఔషద గుణాలు కలిగినటువంటిది. క్రి పూ 500 సం; క్రితమే దీని గురించిన  ప్రస్తావన ఉన్నది.పురాతన కాలం నాటి రాచరిక కాలపు దర్పననికి చిహ్నం ఈ కుంకుమపువ్వు వేద కాలాల నుంచి సౌందర్య పోషణలో ప్రముఖమైన స్తానాన్ని పొందింది.ఆసేతు హిమాచలం భారతీయ సంస్కృతీలో విడదీయరాని బంధం కలిగి ఉన్నది. కుంకుమపువ్వును కుండిల్లో కూడా పెంచుకోవచ్చు.వర్షాకాలం చివర్లో నాటిన దుంపలు  పెరిగి పెద్దవై సీతాకాలం చివరకు పంట చేతికస్తుంది. కొబ్బరి పిట్టు వానపాముల ఎరువు సమానంగా మట్టిలో కలిపి ఎరువు కుండీలో నింపాలి.అప్పుడు ఈ దుంపల్ని నాటుకోవాలి.ఈ కుండిలను పాక్షిక ఎండలో పెంచుకోవచ్చు.దక్షిణ భారతదేశంలో అయితే చలి  ఎక్కువగా ఉండే
మెట్ట ప్రాంతాలలో  పండిచ్చుకోవచ్చు. ఈ చెట్లను వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాలనుఎన్నుకోవాలి వీటికి ప్రకృతి సిద్దమైన ఎరువులనే వాడాలి. నాటిన రెండు నెలలకే పువ్వులు వస్తాయి. ఎండాకాలం మొదలవుతూనే కోతను కోసేస్తారు. ఈ పంటకు మట్టి గుల్లగా ఉండాలి.వాతావరణంలో తేమ ఉందని ప్రదేశాలు అయితే మంచిది.
కుంకుమపువ్వును ఇంగ్లీషులో శాప్రాన్ అంటారు కదా! ఈ పేరు ఎలా వచ్చిందో  తెలుసా  భాషరాన్ అనే అరబిక్ పదం నుంచి ఈ పదం పుట్టింది. అరబిక్ భాషలో భాషరన్ అంటే పసుపు అని అర్థం కుంకుమపువ్వులోని అండాశయం పసుపు రంగులోఉండటం వల్లనో, ఈ కేసరాలను పాలలో వేసినప్పుడు పసుపు రంగులోకి మారడం వల్లనో ఈ పేరు వచ్చి ఉండవచ్చుకుంకుమ పువ్వులను ఉత్తరాది రాష్టాల్లో కేసర్ అని పిలుస్తారు.కుంకుమపువ్వులోని కేసరాలనే కుంకుమ పువ్వుగా తినుబండారాలలో వాడతాం కాబట్టి “కేసర్” అనే పేరు వచ్చి ఉండవచ్చు.
కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ వంటి గ్లూకో సైడులున్నాయి.వీటితో పాటు బీటా ,గామా కేరోటిన్లు కూడా ఉన్నాయి. కుంకుమ పువ్వును గంధం లా చేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గి చర్మం సున్నితంగా ఆకర్షినియంగా ఉంటుందని పూర్వ  కాలం నుంచి భావించేవారు. ఈ పువ్వులో విటమిన్  ఎ ఫోలిక్ యాసిడ్ విటమిన్ సి ఎక్కువగా ఉన్నాయి.
కామెంట్‌లు