పసిడి రంగు నులివెచ్చని
కిరణాలతో జగతిని
మెలుకోలుపు సూర్యోదయం...
స్వచ్ఛమైన ప్రకృతిలో
చల్లని గాలి మరచి.
ఏ సి గాలులతో
నివాసాలాయే నేడు.....
అమ్మ అనే కమ్మని
పిలుపు విడి......
మామ్మీ అంటూ మన
సంస్కృతి మరిచేరు....
ఆధునిక పోకడలో
బంధాలను వదిలి
ఒంటరిగా ఉంటూ
చరవాణితో కాలం
వెల్లబ్బుతున్నారు......
సహజత్వం కాదని
కృత్రిమమైన వాటికి
ఆకర్షితులౌతున్నా.........
ఓ మనిషి మెలుకో........
మెలుకోలుపు నీవై ....
మంచిని నేర్చుకో......
నేర్పించు....
స్ఫూర్తి నిస్తూ......
మార్గం చూపు
మార్గదర్శి వై
సాగిపో.....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి