టెన్త్ క్లాస్ రిజల్ట్ వస్తాయంటే శివా కి భయం పట్టుకుంది. పుస్తకాలు ఆలస్యం గా రావటం కరోనా టైంలో పొలం కూలీపనులకు వెళ్లి చదువుకు టాటాచెప్పాడు.ఇప్పుడు క్లాసులు జంప్ చేయటంతో పాటు చెడు సావాసాలతో సాయంత్రం కాగానే సరదాగా గుట్కా ఈ-సిగరెట్ మద్యంచుక్క కి అలవాటు పడ్డాడు. మొదట్లో ఒళ్లు కళ్ళు తిరిగినా అలవాటైంది. ఆమత్తులో ఏదో గమ్మత్తు! తండ్రి కరోనా తో పోవటం తల్లి గారాబంతో శివా కి అడ్డు అదుపులేవు.తల్లి వెళ్లి ఆఊరి మాష్టారు దగ్గర మొరపెట్టుకుంది. శివా మొండి కెత్తాడు.కరోనా రాకముందు వారు ఆయన విద్యార్ధులే!సాయంత్రం ఫ్రీగా ఇంటికి పిల్చి చదివించేవారు.కానీ కరోనా తో బంధం తెగింది.మాష్టారు రిటైర్ అయ్యారు. వాకింగ్ కి బైలుదేరిన ఆయనకి ఆచెట్టు కింద పత్తాలు ఆడుతూ శివా ఇంకొందరు పిల్లలు కన్పించారు."ఒరే!ఫెయిలైతే మానాన్న చితకబాదుతాడురా!" "మాఅన్న హాస్టల్లో పడేస్తాడుట!" "ఆ..నేను ఏంచేస్తానో తెలుసా?ఎంచక్కా ఉరి వేసుకుంటా." "మరి ఆతాడు తెగిపోతే?" "అంతా భయపడి పరుగెత్తుకుంటూ వస్తారు. ఫెయిలైతే ఫర్వాలేదని పానంతో ఉంటే చాలని ఏడుస్తారులేరా!" వారు మాష్టారుని గమనించకుండా మద్యం చుక్క వేస్తూ పానీపూరీ మిర్చిబజ్జీ తినసాగారు."ఏమర్రా పిల్లలూ!ఏంచేస్తున్నారు," మాష్టారు పిలుపుతో డంగైపోయారంతా! ఎదురుగా నిలువెత్తు విగ్రహం! గజగజవణుకుతూ లేచారు. "రేపటినించీ ఇక్కడ మీకు ఆటపాటలు కరాటే శిక్షణ ఉంటుంది. చెట్ల కూరగాయల పెంపకం మొదలు పెడదాం. మిలటరీ నించి రిటైర్ అయిన మాబంధువు ఇక్కడే ఉంటాడు. సాయంత్రం పుస్తకాలు పేపర్లు ఇక్కడ పెడతా!రోజు చదివిస్తా!" "సార్! నేను టెన్త్ పాస్ కానని టెన్షన్ గా ఉంది!"శివా భోరుమని ఏడ్వసాగాడు."ఇప్పుడు ఏడ్చి ఏంలాభంరా!చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏంలాభం? బుద్ధి లేకుండా సంపాదించి ఇలా తగలేసి ఒళ్లు గుల్ల చేసుకుంటారా? మీలాంటి వారే గూండాల టెర్రరిస్టుల చేతిలో పడి దేశానికి కుటుంబానికి చేటుతెస్తారు. పాస్ కావటం మార్కుల కన్నా ముఖ్యం జీవితం ని మంచి మార్గం లో నడపటం! మన ప్రధాని మోడీజీ తల్లి హీరాబెన్ ని ఎలా పూజించారు ఆమె నూరో పుట్టి న రోజు నాడు !? ఎంత గర్వంగా చెప్పారు "మాఅమ్మ ఒకరింట్లో అంట్లు తోమేది అని తను చాయ్ వాలా అని "చెప్పారు. అంతపెద్ద కుటుంబం లో పుట్టి ఈరోజు ప్రధానిగా ఆదర్శంగా నిలిచారు.యోగీ ఆదిత్య ముఖ్య మంత్రి గా ఉన్నా తన కుటుంబం బీదగా జీవిస్తున్నా దేశం మిన్న అంటున్నారు. మీరు స్వార్ధం తో చెత్త ఆలోచనల తో పతనం అవుతున్నారు".అంతే అంతా ఆయన కాళ్ళపై బడి ఏడుస్తూ "సార్!మీరు చెప్పినట్లుగా వింటాం "అన్నారు🌹
రిజల్ట్! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి