ఆప్యాయత - అనురాగాలకు...
సుఖ,సౌఖ్యానందాలకు...
నిర్భయ, నిశ్చింతలకు...
అది మనిషికైనా, మృగం కైనా
పశు, పక్ష్యాది ప్రాణికోటికి.....
దేనికైనా.... తల్లి ఒడిని మిం చినది....వేరొకటుంటుందా..!?
అమ్మస్పర్శలో ఆనందం...... ఇవ్వగలిగేదేముందీ సృష్టిలో ?!
అమ్మఒడిలో నిశ్చింతగా....
నిదురపోయినట్లు జన్మలో ఎప్పుడైనా... ఎక్కడైనా... అంతహాయిగా నిదుర పో గలి గామా.... !?
బిడ్డకు అమ్మఒడిని మించిన
స్వర్గం ఈ ఇలలో... కల్లే... !!
తల్లి బిడ్డను స్పృశించినా....
బిడ్డ తల్లిని స్పర్శించినా.... ఆ అనుభూతే వర్ణనాతీతం !!
*****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి