*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 016*
 *చంపకమాల:*
*పరమదయానిధే పతిత | పావననామ హరేయటంచు సు*
*స్థిరములై సదా భజన | సేయు మహాత్ముల పాదధూళి నా*
*శిరమునదాల్తు మీరటకు | జేరకుడంచు యముండు కింకరో*
*త్కరముల కాన బెట్టునట | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
దయా సాగరుడవు అయిన, దశరధరామా! నీవు దయకు గని వంటి వాడవు, పాపాత్ములను కూడా మంచివారిగా చేయగలవాడివి, అయిన నిన్ను "హరీ" అని పిలుస్తూ నీ యందే మనసు నిలిపి భజనే మహానుభావుల, మహాత్ముల కాలి దుమ్మును నా తలమీద వుంచుకుంటాను. ఎందుకంటే, అటువంటి మహానుభావుల పాదధూళి నుదుట వుంచుకన్న వారి వైపుకు వెళ్ళవద్దని, తన భటులకు యమరాజు చెపుతాడట....... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*నామ స్మరణను మించి మన మానవ జాతిని ఉద్ధరించ గలిగిన మరొక సాధనం లేదు, దొరకదు. చిన్న వయసు లోనే తన వద్ద వున్న నామ స్మరణ శక్తి తో యమపాశాన్ని తన దాకా రానీయకుండా చేసాడు మార్కండేయుడు. ముని శాపం వల్ల రాయి గామారిన అహల్య ఆ రామపాద మహిమతోనే తిరిగి తన రూపం పొందుతుంది. ఇంత మహిమాన్వితమైన పరమేశ్వరుని నామ స్మరణ నిరంతరం మనల్ని అంటి పెట్టకుని వుండేలా లోక సంరక్షకుడైన సీతాపతిని ప్రార్ధించుకుందాము ......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు