*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 018*
 *చంపకమాల:*
*అజునకు దండ్రివయ్యు సన | కాదులకుం బరతత్వమయ్యు స*
*ద్ద్విజమునికోటికెల్ల బర | దేవత వయ్యు దినేశవంశ భూ*
*భుజులకు మేటివయ్యుఁబరి | పూర్ణుఁడవై వెలుగొందు పక్షిరా*
*డ్ధ్వజ మిముఁబ్రస్తుతించెదను | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
దయ కరుణ అనే గుణాల రూపమైన దశరధ రామా! నీవు బ్రహ్మ కు తండ్రివి. బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందలాదులకు పరతత్వముగా కనిపించావు. మంచి బ్రాహ్మణులు, మునులకు నీవే దేవతవు. సూర్యవంశ రాజులలో గొప్పవాడిగా కీర్తింపబడి, పక్షి రాజైన గరుత్మంతుని నీ రధానికి జెండాగా వుంచుకున్న నిన్ను నేను ఎల్ల కాలం కీర్తిస్తూ, భజన చేస్తూ వుంటాను....... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*పరాత్పర పరమేశ్వరుడు ఒక్కడే. ఆయనే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడైన శివుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరు కాదు. వేరు రూపాలలో వున్న ఒకే పరతత్వము. ఆ పరతత్వమును తెలుసుకుని, పట్టుకుని వుండగలిగిన వారు మోక్షప్రాప్తికి అర్హులు. ఆ పరతత్వమును మనకు పరిచయం చేయగలిగిన వారు సద్గరువు. అటువంటి సద్గరువు మనల్ని తన దగ్గరకు పిలిపించుకుని పుత్ర వాత్సల్యంతో చూపిన తత్వమార్గాన్ని అనునిత్యం సాధన చేయగలిగేలాగా అనుగ్రహించమని, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్థిస్తూ......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు