*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 019*
 *ఉత్పలమాల:*
*పండిత రక్షకుం డఖిల | పాపవిమోచను డబ్జసంభవా*
*ఖండల పూజితుండు దశ | కంఠ విలుంఠన చండకాండ కో*
*దండ కళా ప్రవీణుఁడును | తావక కీర్తి వధూటికిత్తుఁ బూ*
*దండలు గాఁగ నా కవిత | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
దయ కరుణ అనే గుణాల రూపమైన దశరధ రామా! నీవు పండితులను రక్షించు వాడవు. మహా పాపముల నుండి అందరినీ కాపాడే వాడివి. బ్రహ్మ, దేవేంద్రుడు మొదలగు వారిచేత పూజింప బడే వాడివి. పదితలల రావణాసురుని కూడా ఎంతో తేలికగా పగల నేర్పరివి. ఇంతటి నీ కీర్తి కాంత మెడలో నా పద్యాలు అనే పూలతో చేయబడిన దండ వేసి నిన్ను పూజిస్తాను........ అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ఎవ్వరి నైనా, ఎంతటి వారినైనా నీ నామ జపం చేసే వారైతే చాలు వారిని చుట్టు ముట్టిన ఎటువంటి పాపములనైనా పోగొట్టి, వారికి మోక్షమును ఈయగలిగిన నామం, నీ రామ నామం. అంతటి మహిమాన్వితమైన నామాన్ని చుక్కానిగా చేసుకుని మా జీవిత నౌకను మోక్ష తీరాలకు చేర్చుకునే శులభ మార్గం మాకు ఎల్లప్పుడూ ఆలంబనగా వుండేలా అనుగ్రహించమని ఆ అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్థిస్తూ......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు