*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-( 119 )*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సంధ్య తపస్సు - శివుని స్తుతి - మేధాతిథి యజ్ఞమునకు వెళ్ళుట*
*బ్రహ్మ, నారదుని ఇలా చెప్పాడు -* 
*నారదా! నాలుగు యుగాల పాటు జలపానము మాత్రమే చేసి మౌనముగా సంధ్య చేసిన తపస్సు కు మెచ్చిన పరమశివుడు దివ్య నేత్రాలు, జ్ఞనము ఇచ్చి సంధ్యా దేవి ఎదుట ప్రత్యక్షమై, ఆమె చెసిన స్తోత్రలకు సంతోషించి తన కోరికలను తెలియజేస్తే తీర్చుతాను అని అనుగ్రహం తెలియజేస్తాడు, నందివాహనుడు.*
*తన ఎదురుగా వుండి పార్వతీపతి పలికిన అమృతమైన మాటలను విని సంధ్య "జీవుడు పట్టగానే కామదేవుని అధీనము కాకుండా వుండాలి. నా భర్త నాయందు మిక్కిలి అనురాగము కలిగి వుండాలి. నా భర్త తప్ప వేరెవరైనా నావైపు కామ దృష్టి తో చూస్తే వారు ఆ క్షణమే నపుంసకులు అవ్వాలి" అని కోరుతుంది.*
*ఈ మాటలను విన్న అంబికాపతి, ప్రతీ ప్రాణి జీవితములో బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము అనే నాలుగు స్థితులు వుంటాయి. కౌమారము దాటి యవ్వనము లోకి అడుగిడుతే గానీ ఏ జీవిపై కూడా కామదేవుని ప్రభావము లేకుండా అనుగ్రహిస్తున్నాను. ఈ విధముగా సంధ్యా దేవీ! నీ తపస్సు ప్రభావముతో ఈ హద్దును నేను నియమిస్తున్నాను. నీవు ఈ సమస్త భూమండలములో దివ్య సతీగా వెలుగొందుతావు. ఈ స్థానము వేరెవరికీ సాధ్యము కానిది. నిన్ను వివాహమాడిన పురుషుడు తప్ప వేరెవరూ నిన్ను ఆదరముతో చూడలేరు. అలా చూచిన వెంటనే, అతడు నపుంసకుడు అవుతాడు. ఇందులో సందేహము లేదు. మహానుభావుడైన ఒక మహర్షి నీకు భర్త అవుతాడు. నీ భర్త నీతో ఏడు కల్పముల వరకు సహజీవనం చేస్తాడు.*
*నీవు పూర్వ కాలములో, అగ్నిలో నా శరీరం త్యజిస్తాను అని శపథం చేసావు. అది నెరవేరే మార్గం ఇప్పుడు నేను చెపుతాను. ఈ చంద్రభాగ నదీతీరంలో గొప్ప మునివరుడైన మేధాతిథి మహర్షి జ్యోతిష్టోమము అనే మహా యజ్ఞము చేస్తున్నాడు. పన్నెండు సంవత్సరాలు జరిగే ఆ యజ్ఞం లో అగ్ని ఎల్లప్పుడూ తీక్షణమైన జ్వాలలతో వెలుగుతూ వుంటుంది. అందులో నీవు ఎవరిని భర్తగా పొంద దలచుకున్నావో ఆ మహర్షిని తలచుకుంటూ, నీ శరీరమును ఆ అగ్నిలో చాలించు.  ఇలా ఆదేశించి పరమశివుడు అంతర్ధానం అయ్యాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు