"నీ జ్ఞాపకం నాతోనే"1980(ధారావాహిక 77,వ,బాగం) "నాగమణి రావులపాటి "
 రాహుల్ వచ్చాడు... కారు డోర్ తెరిచి వెల్కమ్ మేడమ్ అని స్వాగతం పలికాడు... నవ్వుతూ  వెళ్ళి కూర్చోగానే కారు స్టార్ట్ చేసాడు... కుసుమా అని
పిలిచాడు రాహుల్...చెప్పండి అన్నట్టు చూసింది
కుసుమ.......................!!
థాంక్యూ అన్నాడు రాహుల్ దేనికి అని అన్నది
కుసుమ నా మనసులో కోరిక నీవై నెరవర్చినందుకు
సారీ రాహుల్ నావల్లే మీరెంత బాధ పడుతున్నారో
నాకు తెలియంది కాదు...ఏం చేస్తాం కొంచెం
ఓపిక పట్టండి... పూర్ణా పెళ్ళి అయిందంటే మన
ఈ దూరం శాశ్వతంగా తొలగి పోతుంది.........!!
 
అని అన్నది కుసుమ పోనీలే మద్యమద్యలో
ఇలాంటి దగ్గరలు కల్పిస్తే అదే పదివేలూ అని
కుసుమ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు
ఇద్దరి హృదయాలు ఆనందం డోలికల్లో .....
తేలి ఆడాయి.............!!
హంసలు దీవి చేరుకున్నారు. చూసావా కుసుమా
నదీ సాగర సంగమం త్వరలో మనం కూడా
ఇలాగే ఒకరికి ఒకరం చేరువ కావాలి ఆరోజు
కోసమే నా ఈ ఎదురు చూపులు అని ఆవేదనగా
 అనే రాహుల్ ను చూసి కుసుమ హృదయం 
తల్లడిల్లి పోయింది.............!!
 రాహుల్ ఆరోజు త్వరలోనే వుంది మన నిరీక్షణ
ఫలింపజేసే రోజు దగ్గరలోనే వుంది నాకు ఇంకా
ఓపిక లేదు మీకు దూరంగా వుండలేను అని
చిన్నపిల్లలా ఏడ్చేసింది..‌.కుసుమా ఊరుకో
ఇందుకేనా మనం ఇక్కడిదాకా వచ్చింది  అని
కుసుమను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు.....!!
రా నా ఒడిలో సేద దీరుతా నన్నావుగా అని
రాహుల్ అనగానే నాకంటే నీకే అలసట తీరాలి
అంటూ తన ఒడి చూపింది అంతే రాహుల్ 
కుసుమ ఒడిలో తల పెట్టగానే రాహుల్ తల
నిమురుతూ రాహుల్ తలపై తల వాల్చిన 
కుసుమ ఆనందం బాష్పాలు రాహుల్ కంటి
కన్నీరు లో కలిసి సాగరంలో ఇంకి పోయాయి......!!
అలా ఎంతసేపు వున్నారో తెలీయదు  అలల
సవ్వడి గిలిగింతలతో ప్రేమ చినుకులు చిలకరించగా
పరవశించిన ప్రకృతి పులకరిపులకు అలుపులేదు...
రాహుల్ అని పిలిచింది కుసుమ... ఏమిటి అని
అన్నాడు రాహుల్... పక్కనే వేణుగోపాలస్వామి
ఆలయం వుంది. అక్కడ స్వామివారికి దర్శించుకుని
బయలు దేరుదాం అని అనగానే అన్యమనస్కంగా
 కదిలాడు రాహుల్..........!!
ఆలయం దర్శనం చేసుకున్నారు ఇంతలో రాహుల్
కుసుమా ఇక్కడే వెయిట్ చేయి ఇప్పుడే వస్తాను
అంటూ ఎటో వెళ్ళాడు...తను వెళ్ళిన వైపు చూస్తూ
కూర్చుంది కుసుమ...ఒక కవరుతో తిరిగి వచ్చాడు
రాహుల్ ఏమిటీ కవరు భారీగానే వుంది
మనకుఏమన్నా తినటానికి తెచ్చావా అని చేతిలో
 కవరు తీసుకోబోయింది...‌...........!!
ఆగు కుసుమా నాదొక చిన్న కోరిక వుంది
తీరుస్తావా నేను ఏమని అన్నా కాదన కూడదు
నాకోరిక తీరిస్తే నువ్వు ఎలా చెపితే అలా వింటాను
అని రాహుల్ అనగానే సరే అలాగే నెరవేరుస్తా
అది ఏదైనా సరే నీ సంతోషమే నాకు కావాలి
అని అన్నది కుసుమ... అయితే చెబుతాను విను
అంటూ రాహుల్.(సశేషం).......................!!

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం