"నీ జ్ఞాపకం నాతోనే"1980(ధారావాహిక 79,వ బాగం)--"నాగమణి రావులపాటి "
 "ఇంతలో,కారు దగ్గరకు ఒకతను రావటం గమనించాడు, రాహుల్... అటువైపు తలతిప్పి
ప్రశ్నార్దకంగా ముఖం పెట్టాడు. ఆ వచ్చిన అతను
రాహుల్ తో ఈ బేగ్ అక్కడ మరిచి పోయారట
పండితుల వారు మీకు ఇవ్వమని చెప్పారు, అని
కుసుమ, హేండ్ బ్యాగ్ యిచ్చి వెళ్ళాడు......!!
ఈ దండలు మార్చుకునే క్రమంలో పరిసరాలను
మరిచిన కుసుమకు, తన హేండ్ బ్యాగ్ అక్కడే
మరిచిన సంగతి గుర్తుకు రాలేదు.కొంచెం దూరంలో
ఇటువైపే చూసే పండితులవారికి ఒక నమస్కారం
పెట్టి కారు స్టార్ట్ చేసాడు రాహుల్...........!!
కుసుమ బేగ్ ఓపెన్ చేసి దేనినో వెతుకుతోంది..‌
ఏమిటి కుసుమా వెతుకుతున్నావు అని 
అడిగాడు రాహుల్... ఏమీ లేదు లెండి, అని తన
చేతికి తగిలిన, ఒక చిన్న కవరును, తీసి హమ్మయ్య
అనే ఫీలింగ్ తో మరలా, భద్రపరచడం, చూసిన
రాహుల్ అదేమిటో నేను తెలుసుకోవచ్చా?? అని
అన్నాడు..........‌!!
కామ్ గా ఆ కవరు తీసి రాహుల్ ,చేతిలో, పెట్టింది
కుసుమ. ఓపెన్ చేసి చూసాడు, రాహుల్......
తను మొదటి సారి ఇచ్చిన, న్యూ ఇయర్,గ్రీటింగ్ కార్డ్ తనకు బ్యాంక్ లో జాబ్ రాగానే జాయిన్ అవటానికి వెళ్ళేటప్పుడు,అడిగి తీసుకున్న
తన ఫొటో ఆ కవరులో వుండటం చూసిన రాహుల్
హృదయం అలవి కాని ప్రేమతో నిండిపోయింది...!!
అంటే నన్ను అనుక్షణం నీ హృదయంలో నిలుపు
కున్నావా కుసుమా అని అంటూ వుంటే మీరేమీ తక్కువా ఏమిటి, నాఫొటోలు పెట్టుకు తిరగట్లేదా
 అని అన్నది, కుసుమ ఇద్దరూ నువ్వుల జల్లులు కురిపించారు.......‌.!!
కాల వాహినిలో కరిగే రోజులు కడు దగ్గరైన
పరిస్థితులు,తెలియ కుండానే మబ్బులు పట్టిన చందమామలా  వెలుగులు కమ్మిన తిమిరంలా
మాయ వేసిన ముసుగులో తెలియని సమయం...
మాయ తెర తొలిగించే మబ్బులు వీడిన వెన్నెల...
వెలుగులు చిందించే సూరీడు... జగతిని ఆక్రమించి
జీవన ప్రగతికి దోహద మవుతాయి........!!
అలాగే పూర్ణా వేణుల వివాహ ముహూర్త సమయం
దగ్గరికి వచ్చేసింది పెళ్ళి ఏర్పాట్లు ఘనంగా నే
చేస్తున్నారు.... ఎవరికి పురమాయించిన పనులలో
వాళ్ళు బిజీ అయ్యారు...కుసుమకు ఎక్కడలేని
ఆరాటం, ఏదీ తక్కువ కాకూడదు అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటోంది.‌..ఇంతలో (సశేషం)........!!

కామెంట్‌లు