"నీ జ్జాపకం నాతోనే"1980;-(ధారావాహిక 80,వ బాగం)-"నాగమణి రావులపాటి "
 ఇంతలో పిడుగులాంటి వార్త రాహుల్ నాన్నగారికి 
హార్ట్ ఎటాక్ వచ్చిందని కబురు వచ్చింది.....
రాహుల్ హాటాహుటిన బయలుదేరి వెళ్ళాడు...
దేవుడా పెళ్ళి ఇంకా పది రోజులు వుంది ....
ఇంతలో ఈ వార్త వినగానే  కుసుమ తల్లడిల్లింది..!!
పెద్దలకు తెలిసినా తెలియక పోయినా రాహుల్ కు
తనకు వివాహం జరిగింది... ఇప్పుడు ఈవార్త
గుండెలను పిండి చేస్తోంది... జరగరానిది జరిగితే
ఆ ఊహే మనసులో భయాన్ని కలిగిస్తోంది...
వెంటనే గీతకు ఫోన్ చేసింది...........!!
ఏమిటే కుసుమా  ఎలా వున్నావు అని కుశలప్రశ్నలు
వేసింది గీత నేను బాగానే వున్నాను కానీ రాహుల్
నాన్నగారికి హార్ట్ ఎటాక్ వచ్చిందట హడావిడిగా
వెళ్ళాడు రాహుల్ అని అన్నది కుసుమ...
అలాగా దేవుని దయవల్ల ఏమీ కాదులే వే అని
అన్నది గీత...,............!!
ఏమీ కాకూడదనే, నేను కోరుకునేది, అని గీతా
అని పిలిఛింది, కుసుమ...ఏమిటే ఏదో చెప్పాలని
అనుకుంటున్నట్టున్నావు చెప్పవే త్వరగా అని
గీత అనగానే నీకో విషయం చెప్పకుండా దాచాలనే
అని అన్నది కుసుమ అవునా నాకు కూడా తేలియని
రహస్యమా చెప్పవే త్వరగా అని తొందర చేసింది గీత
అదేనే ఆమద్య నేనూ రాహుల్ హంసలు దీవికి
వెళ్ళాము  అనుకోకుండా అక్కడ రాహుల్ కోరిక
మేరకు మేమిద్దరం వేదమంత్రాలు నడుము దండలు
మార్చుకున్నాము,...అని అన్నది కుసుమ...
వావ్ నిజమా కుసుమా కంగ్రాట్స్ ఓసినీ  నాకు 
చెప్పనేలేదు. పెళ్ళి వరకేనా లేక హనీమూన్ కి కూడా
వెళ్ళిరా కాస్త చిలిపిగా అడిగింది, గీత కుసుమ ను
ఊహు ఎటూ వెళ్ళలేదు,అని రాహుల్ తనకు
చేసిన వాగ్దానం గురించి వివరించింది, కుసుమ..!!
అదేనే  నా బాధ నా ఇంటి పేరును మార్చేసాడు రాహుల్ నేను ఇప్పుడు వాళ్ళ ఇంటి కోడలును
కదా జరగరానిది జరిగితే నా పరిస్తితి ఏమిటి
అని వాపోయింది కుసుమ..ఏమీ కాదు.....
ధైర్యంగా వుండు అన్నీ సవ్యంగా జరుగుతాయి
కంగారు పడకు అని అనుసరించింది,గీత......!!
ఆరోజు ఎలాగో గడిచింది.. తెల్లవారి రాహుల్
ఫోన్ చేసాడు పూర్ణా రిసీవ్ చేసుకుంది ...హలో
పూర్ణా కుసుమకు ఇస్తావా ఫోన్ అని అన్నాడు
రాహూల్ అలాగే  రాహల్ గారు, అని అక్కా
రాహుల్ గారూ నీకే ఫోన్ చేసారు. అని పిలీచింది
పూర్ణా (సశేషం)........... !!

కామెంట్‌లు